National

జైడస్ క్యాడిలా తయారు చేసిన డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌కు భారత్ అనుమతి

ప్రపంచంలోనే తొలిసారిగా కరోనా వైరస్ ను అడ్డుకోవడం కోసం తయారు చేసిన డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అనుమతి ఇచ్చింది. ఇది ప్రపంచంలో మొట్టమొదటి డీఎన్ఏ ఆధారిత కోవిడ్ -19 వ్యాక్సిన్.. ఇది భారతదేశంలో అభివృద్ధి చేయబడింది. జైడస్-కాడిలా వ్యాక్సిన్ పిల్లలకు కూడా ఇవ్వబడుతుంది. 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారికి ఉపయోగించడానికి ఇది వర్తిస్తుంది.

అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జైడస్ క్యాడిలా (క్యాడిలా హెల్త్‌కేర్) తయారు చేసిన ఈ మూడు డోసుల వ్యాక్సిన్‌ ‘‘ప్లగ్ అండ్ ప్లే’’ సాంకేతికత ఆధారంగా తయారైనట్లు ప్రభుత్వానికి చెందిన బయోటెక్నాలజీ విభాగం(బీటీ) తెలిపింది. కరోనా వైరస్‌లో వచ్చే కొత్త జన్యుమార్పులకు (మ్యుటేషన్లకు) అనుగుణంగా ఈ డీఎన్ఏ ప్లాస్మిడ్ కరోనా వ్యాక్సిన్ ప్రతిస్పందిస్తుంది. ఇప్పటికే ఉన్న వేరియంట్లతోపాటు భవిష్యత్తులో వచ్చే కొత్త వేరియంట్లను కూడా నిలువరించడంలో ఈ వ్యాక్సిన్ కీలకపాత్ర పోషిస్తుందని సంస్థ చెబుతోంది. జీకోవ్-డి (ZyCoV-D) పేరుతో విడుదల కానున్న ఈ వ్యాక్సిన్‌కు శుక్రవారం నాడు డీజీసీఐ నుంచి అత్యవసర వినియోగానికి అనుమతి లభించింది. ఈ వ్యాక్సిన్‌ను పూర్తి దేశీ పరిజ్ఞానంతో తయారు చేసినట్లు తెలుస్తోంది. డీజీసీఐ అనుమతి లభించిన రెండు నెలల్లో తమ మూడు డోసుల వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తామని జైడస్ క్యాడిలా తెలిపింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ను 28,000 మంది వాలంటీర్లపై చేశారు. భారతదేశంలో ఇప్పటివరకు కోవిడ్ -19 వ్యాక్సిన్ కోసం ఇది అతిపెద్ద వ్యాక్సిన్ ట్రయల్. ఇంతకు ముందు నిర్వహించిన మొదటి, రెండు క్లినికల్ ట్రయల్స్‌లో ఈ టీకా ఇప్పటికే బలమైన ఇమ్యునోజెనిసిటీ, టాలరబిలిటీను ప్రదర్శించింది. క్లినికల్ ట్రయల్స్ స్వతంత్ర డేటా సేఫ్టీ మానిటరింగ్ బోర్డ్ (DSMB) ద్వారా పర్యవేక్షించబడ్డాయి.

జైడస్ గ్రూప్ ఛైర్మన్ పంకజ్ ఆర్. పటేల్.మాట్లాడుతుగా “COVID-19 తో పోరాడటానికి సురక్షితమైన, మహమ్మారిని తట్టుకోగల సమర్థవంతమైన వ్యాక్సిన్ తీసుకొని రావడానికి చేసిన మా ప్రయత్నాలు ZyCoV-D తో రియాలిటీగా మారినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రపంచంలోని మొట్టమొదటి DNA వ్యాక్సిన్‌ను చాలా కీలకమైన తరుణంలో సృష్టించామని” అన్నారు. చాలా సవాళ్లు ఉన్నప్పటికీ, భారతీయ పరిశోధనా శాస్త్రవేత్తలు అనుకున్నది సాధించారని చెప్పుకొచ్చారు. డీజీసీఐ ఆమోదం పొందిన రెండవ స్వదేశీ టీకాగా ZyCoV-D నిలిచింది. డీజీసీఐ ఆమోదం పొందిన ఆరో టీకాగా మారింది. ఆగస్టులో జాన్సన్ & జాన్సన్ యొక్క సింగిల్ డోస్ వ్యాక్సిన్ కూడా ఆమోదం పొందింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × five =

Back to top button