National

‘జై భోలేనాథ్’ అంటూ పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్నారు.. ఎఫ్.ఐ.ఆర్. నమోదు..!

జై భోలేనాథ్.. అంటూ ఏదైనా వీడియో వాట్సాప్ లో వచ్చింది అంటే ఓపెన్ చేయడానికి అనుమానించాల్సి వస్తోంది. ఎందుకంటే కొందరు వ్యక్తులు ‘జై భోలేనాథ్’ అంటూ పోర్న్ వీడియోలు షేర్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూక్కాబాద్‌కు చెందిన ముస్లిం యువకుల బృందం వాట్సాప్ గ్రూపులలో హిందూ దేవతలను అవమానిస్తూ అభ్యంతరకరమైన వీడియోలను షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని ఫరూక్కాబాద్‌కు చెందిన కొంతమంది ముస్లిం యువకులు నడుపుతున్న వాట్సాప్‌ గ్రూప్ లో అశ్లీల వీడియోను ప్రసారం చేసినట్లు స్వరాజ్య జర్నలిస్ట్ స్వాతి గోయెల్ శర్మ తెలిపారు. ‘మస్తీ’ అనే వాట్సాప్ గ్రూపులో, పోర్న్ క్లిప్ ను వాయిస్ఓవర్ మరియు టెక్స్ట్ తో “జై భోలేనాథ్, జై భోలేనాథ్” అని పోస్ట్ చేయబడింది. దీంతో హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఈ వీడియో కొద్దిరోజులకు హిందూ గ్రూపులకు కూడా చేరింది. దీంతో హిందూ సంఘాలు ఫతేఘర్ పోలీస్ స్టేషన్లో వాట్సాప్ గ్రూప్ అడ్మిన్లపై కేసు పెట్టారు. స్వాతి గోయెల్ శర్మ దీనిపై పలు వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. సెక్షన్ 153 ఎ కింద వీడియోను పోస్ట్ చేసినందుకు ఏడుగురు సభ్యులపై కేసు నమోదైంది. శత్రుత్వాన్ని పెంపొందించడం, ఐపిసి సెక్షన్ 120 బి, ఐటి చట్టం కింద కేసులను నమోదు చేశారు. ఈ కేసుల్లో పోలీసులు జుల్ఫికర్‌ను కీలక నిందితులుగా పేర్కొన్నారు.

మొహమ్మద్ జుల్ఫికర్ పోర్న్ క్లిప్‌ను గ్రూపుల్లో పంచుకున్నాడని గుర్తించారు. వాట్సాప్‌లోని ఇతర వినియోగదారులు దీన్ని షేర్ చేశారని ఆరోపించారు. జుల్ఫికర్‌తో పాటు అశ్లీల క్లిప్‌ను ప్రసారం చేసినందుకు తౌసెఫ్, అడాబ్, జావేద్ సన్నో, మోనా, తస్లిమ్ అన్సారీ, డబ్బూ ఖాన్ లపై కేసు నమోదైంది. కేసు నమోదు చేసిన తర్వాత నిందితులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫతేఘర్ పోలీసులు ట్వీట్ చేశారు. ఈ నిందితులందరిపై హిందూ మహాసభ సభ్యులైన రాజేష్ మిశ్రా, దీపక్ ద్వివేది కేసు నమోదు చేశారు. ఉత్తర ప్రదేశ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 − 11 =

Back to top button