ఆర్య హీరోగా ముత్తయ్య దర్శకత్వంలో ‘ఆర్య 34’ ప్రారంభం

0
842
Zee Studios & Drumsticks Productions present Filmmaker Muthaiya directorial Actor Arya starrer “Arya 34” movie launched with a ritual ceremony
Zee Studios & Drumsticks Productions present Filmmaker Muthaiya directorial Actor Arya starrer “Arya 34” movie launched with a ritual ceremony

అనేక బ్లాక్‌బస్టర్‌లు, విజయవంతమైన చిత్రాలను అందించిన జీ స్టూడియోస్ & డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థల సంయుక్త నిర్మాణంలో ‘ఆర్య 34’ వర్కింగ్ టైటిల్ తో కొత్త ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాయి. యూనిక్ కథలు, పాత్రలు ఎంచుకుంటూ టెడ్డీ, సార్పట్ట పరంపర, కెప్టెన్ వంటి వరుస విజయాలతో ఆకట్టుకుంటున్న ఆర్య ఈ చిత్రంలో కథానాయకుడు. గౌతమ్ వాసుదేవ్ మీనన్ ‘వెందు తనింధతు కాదు’ చిత్రంలో బ్రిలియంట్ ఫెర్ ఫార్మెన్స్ చేసిన సిద్ధి ఇద్నాని ఈ చిత్రంలో కథానాయిక.
ఈ చిత్రం గురించి జీ స్టూడియోస్‌లో సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ మాట్లాడుతూ, “ ఆర్య కథానాయకుడిగా ముత్తయ్య దర్శకత్వంలో డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్స్‌ తో కలసి పని చేయడం ఆనందంగా వుంది. ఆర్య తన వెర్స్ టైల్ పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముత్తయ్య ప్రేక్షకుల పల్స్‌ను తెలుసుకున్న దర్శకుడు. వీరి కలయిక ప్రేక్షకులకు వినోదాత్మక చిత్రాన్ని అందించడం ఖాయం. గతంలో గొప్ప కంటెంట్‌ను అందించిన డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్‌తో కలిసి ప్రేక్షకులకు గొప్ప కంటెంట్‌ను అందించాలని ఆశిస్తున్నాము” అన్నారు.
ఇటీవల విడుదలైన ‘విరుమాన్’తో సహా గ్రామీణ నేపధ్యంలో కమర్షియల్‌గా విజయవంతమైన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు అందించడంలో పేరు తెచ్చుకున్న ముత్తయ్య ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి వేల్‌రాజ్ ఛాయాగ్రహణం అందిస్తుండగా, వీరమణి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

six + seven =