సర్వదర్శనం, శ్రీవారి ఆర్జిత సేవలపై కీలక వ్యాఖ్యలు చేసిన టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి

0
704

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలపై టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆర్జిత సేవలను పునఃప్రారంభించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నామని అన్నారు. ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఏ సేవల ధరలను పెంచే ఆలోచన టీటీడీకి లేదని ఆర్జిత సేవల ధరలను పెంచే ఆలోచన ఇప్పట్లో లేదన్నారు. ధరల పెంపుపై పాలకమండలిలో కేవలం చర్చ మాత్రమే జరిగిందన్నారు. సామాన్య భక్తులకు సర్వదర్శనం ప్రారంభించి పదిరోజులవుతోందని రెండేళ్ల తర్వాత సర్వదర్శనాన్ని ప్రారంభించామన్నారు. సర్వదర్శనం ప్రారంభమైన తరువాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని.. భక్తుల రద్దీ పెరిగినా అన్నప్రసాదం వద్ద ఎలాంటి ఇబ్బందులు రానివ్వడం లేదన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదాన్ని అందిస్తామని.. ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల కోసం చపాతీలు, రొట్టెలను త్వరలోనే అందిస్తామన్నారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనంలో ప్రాధాన్యత ఇచ్చే విధంగా శని, ఆది వారాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. శుక్ర, శని, ఆదివారాల్లో సర్వదర్శనం భక్తుల సౌకర్యార్దం అదనంగా దర్శన టికెట్లు జారీ చేసేందుకు నిర్ణయించారు. రోజుకు సర్వదర్శనం భక్తులకు 30 వేల టికెట్లు ఇస్తున్నారు. టీటీడీ తాజా నిర్ణయంతో సర్వదర్శన భక్తులకు రోజుకు అదనంగా మరో రెండు గంటల దర్శన సమయం పెరుగుతుంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో టీటీడీ దర్శన టికెట్ల కోటాను పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. టీటీడీ అధికారిక వెబ్‌సైట్లో మాత్రమే టికెట్లు పొందవచ్చని భక్తులకు తెలిపింది. అలాగే స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది.

సామాన్య భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సౌక‌ర్య‌వంత‌మైన ద‌ర్శ‌నం, రుచిక‌ర అన్న‌ప్ర‌సాదాలు అందించ‌నున్న‌ట్లు సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లో మాతృశ్రీ త‌రిగొండ వెంగ‌మాంబ అన్న‌ప్ర‌సాద భ‌వ‌నం, పిఏసి – 4 (పాత అన్న‌ప్ర‌సాద భ‌వనం) లోని ల‌గేజి సెంట‌ర్‌ను శుక్ర‌వారం ఉద‌యం అధికారుల‌తో క‌లిసి త‌నిఖీలు నిర్వ‌హించారు. ఇప్ప‌టి వ‌ర‌కు సామాన్య భ‌క్తుల‌కు అందించే ఆర్జిత సేవలు, ద‌ర్శ‌నాల ధ‌ర‌ల‌ను టిటిడి పెంచ‌లేద‌ని,పెంచే ఆలోచన ఇప్పట్లో లేద‌న్నారు. కొండ మీద ఆహారం విక్రయించరాదని బోర్డు తీసుకున్న నిర్ణయం వల్ల ఎవరి ఉపాధికి ఇబ్బంది కలగని విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు.