గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ కె. శివ కుమార్ ఆధ్వర్యంలో మహా నిరసన దీక్ష నిర్వహించారు. మునావర్ ఫరూఖి హిందూ దేవుళ్లను కించపరిస్తే ఆయన షో లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని…ధర్మం కోసం పోరాడే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడం దారుణమని యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ అన్నారు. వారం రోజులోపు రాజాసింగ్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కేసీఆర్ నిన్ను హిందువులు వదిలిపెట్టరంటూ శివ కుమార్ హెచ్చరించారు. హిందువులు ఎంతో సహనంతో ఉన్నారని.. ఫామ్ హౌస్ లో ఉన్న కేసీఆర్ ను బయటకు తీసుకుని రావడానికి పెద్ద సమయం పట్టదని అన్నారు. హిందువులను ఇబ్బంది పెడుతున్న సీఎం కేసీఆర్ ను హిందువులు వదిలిపెట్టారని హెచ్చరించారు శివ కుమార్.