Telugu States

బద్వేలులో వైసీపీ భారీ విజయం.. వైఎస్ జగన్ రికార్డు బద్దలు

బద్వేల్ ఉప ఎన్నికలో వార్ వన్ సైడ్ అయింది. అధికార వైసీపీ మరో ఎన్నికలో కూడా ఘన విజయాన్ని అందుకుంది. బద్వేల్ ఉప ఎన్నిక‌లో 76.25 శాతం ఓట్లను వైఎస్సార్‌సీపీ సాధించింది. 90,533 ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్‌ సుధ ఘన విజయం సాధించారు. మొదటి నుంచి ప్రతి రౌండ్‌లోనూ వైఎస్సార్‌సీపీ ఆధిక్యతతో దూసుకుపోయింది. వైఎస్సార్‌సీపీకి మొత్తం 1,12,211 ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి 21,678 ఓట్లు రాగా, కాంగ్రెస్‌కు మొత్తం 6,235ఓట్లు వచ్చాయి. ఇక పోస్టల్‌ బ్యాలెట్‌లోనూ వైఎస్సార్‌సీపీ మెజారిటీ ఓట్లు దక్కించుకుంది. ఈ ఉప ఎన్నికలో అత్య‌ధిక మెజార్టీ సాధించి వైసీపీ అభ్య‌ర్థి డాక్ట‌ర్ దాస‌రి సుధ వైఎస్ జ‌గ‌న్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైఎస్ జ‌గ‌న్ 90,110 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో జ‌గ‌న్ రికార్డును సుధ ఇప్పుడు అధిగ‌మించారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య ఇదే బ‌ద్వేలు నుంచి 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌ డిపాజిట్‌ కోల్పోయాయి.

Related Articles

Back to top button