More

    ఆ బాధ్యతల నుండి సజ్జల, బుగ్గన, అనిల్, కొడాలికి ఉద్వాసన

    వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రాంతీయ సమన్వయకర్తల బాధ్యతల నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ మంత్రులు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్‌లను అధిష్ఠానం తప్పించింది. సజ్జల, బుగ్గన సమన్వయం చేసిన కర్నూలు, నంద్యాల జిల్లాల బాధ్యతను వైఎస్సార్ జిల్లా జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డికి అప్పగించింది. అనిల్ కుమార్ చూసుకున్న వైఎస్సార్, తిరుపతి జిల్లాలను నెల్లూరు ప్రాంతీయ సమన్వయకర్తగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డికి అప్పగించింది. బాపట్ల జిల్లా సమన్వయ బాధ్యతను ఎంపీ బీద మస్తాన్‌రావుకు అప్పగించగా, కొడాలి నాని వద్దనున్న పల్నాడు బాధ్యతను ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డికి అప్పగించింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త మర్రి రాజశేఖర్‌కు గుంటూరు జిల్లా బాధ్యతను అప్పగించింది. ఈ మూడు జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్తగా మర్రి రాజేశేఖర్‌తోపాటు ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డికి కొత్తగా బాధ్యతలు అప్పగించింది. విజయనగరం జిల్లా బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణ నుంచి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అప్పగించింది. అల్లూరి సీతారామరాజు జిల్లాను బొత్సకు అప్పగించింది. తిరుపతి జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి చెవిరెడ్డి భాస్కరరెడ్డిని తప్పించి.. అనుబంధ విభాగాల సమన్వయకర్త బాధ్యతలను అప్పగించింది. పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఎంపీ విజయసాయిరెడ్డికి చెవిరెడ్డి సహాయకారిగా వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీ భరత్‌ను చిత్తూరు జిల్లా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించింది. ఆ బాధ్యతలను డిప్యూటీ సీఎం నారాయణస్వామికి అప్పగించింది.

    Trending Stories

    Related Stories