వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు చంద్రశేఖర్‌రెడ్డి గుండెపోటుకు గురైనట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నై ఆస్పత్రికి తరలించారు. గుండెలో రెండు వాల్వ్స్ బ్లాక్ అయినట్టు వైద్యులు గుర్తించారు.
ఐతే తాను బాగానే ఉన్నట్లు ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. గుండెనొప్పి రావడంతో అసుపత్రికి వచ్చినట్లు పేర్కొన్నారు. డాక్టర్లు వైద్య పరీక్షలు చేశారని, మరో టెస్టు కోసం చెన్నై తరలిస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో క్షేమంగా ఇంటికి తిరిగి వస్తానని అన్నారు.