More

    రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన వైసీపీ ఎమ్మెల్యే

    అమరావతి రైతుల పాదయాత్రకు పోటీగా వైసీపీ శ్రేణులు కూడా పలు ప్రాంతాల్లో ర్యాలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే..! విశాఖ రాజధానికి మద్దతుగా జేఏసీ కూడా ఏర్పాటయింది. ఈ జేఏసీ సమావేశం సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తన ఎమ్మెల్యే పదవికి స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ కు అందించారు. ఉత్తరాంధ్ర వ్యతిరేకులను రాజకీయంగా బహిష్కరించాలని.. అధికార వికేంద్రీకరణ కోసం తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అచ్చెన్నాయుడికి దమ్ముంటే రాజీనామా చేయాలని ఛాలెంజ్ చేశారు. అచ్చెన్నాయుడిపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని చెప్పారు.

    మరో వైపు టీడీపీ నాయకులకు ఏపీ మంత్రి అమర్ నాథ్ సంచలన సవాల్ విసిరారు. రాజధానిపై రెఫరెండం కావాలంటే టీడీపీ నాయకులంతా కలిసి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లాలన్నారు. ప్రజాభిప్రాయం తెలియజేయడానికి ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలన్నారు. ఇక రాజధానిపై కార్యాచరణను ప్రకటించిన JACకి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందన్నారు. వికేంద్రీకరణకు ఉద్యమం ఉప్పెనలా ఉండబోతుందని తెలిపారు. అక్టోబర్ 15న విశాఖ గర్జన ఉంటుందని మంత్రి అమర్ నాథ్ స్పష్టం చేశారు. LIC కూడలి నుంచి ప్రారంభం అయ్యే ఈ నిరసనకు అన్ని వర్గాల నుండి పెద్ద ఎత్తున మద్దతు కూడగడతాం అని అన్నారు. వికేంద్రీకరణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసే తొలి ప్రయత్నం ఇదే అని అన్నారు. అమరావతి రైతులు ఉత్తరాంధ్రలో ప్రవేశించే సమయంలో పెద్ద ఎత్తున నిరసన తెలపాలని కోరారు.

    Trending Stories

    Related Stories