More

    ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు నిరసన సెగ

    అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు మరోసారి నిరసన సెగ తగిలింది. నక్కపల్లి మండలం పెద్దతీనార్ల గ్రామం రెవెన్యూ పరిధిలోని దొండవాక గ్రామంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొన్న గొల్ల బాబురావును మత్స్యకారులు అడ్డుకున్నారు. గ్రామంలో మంచినీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ నిరసన తెలిపారు. హెటిరో పరిశ్రమ నుండి వెలువడుతున్న విష రసాయనాలను వెంటనే నిషేధించాలని డిమాండ్ చేశారు. రసాయన వ్యర్ధ జలాలను సముద్రంలోకి పంపే పైపు‎లైన్ శాశ్వతంగా నిర్మూలించాలని కోరారు. హెటేరో పరిశ్రమ నుండి వెలువడే వ్యర్ధ రసాయనిక జలాల పైపు లైన్ ను శాశ్వతంగా తొలిగిస్తానని మాట ఇచ్చి మొహం చాటేశారని, ఎన్నికలు వస్తున్నాయని కాబట్టే గ్రామానికి వచ్చారంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్, గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

    Trending Stories

    Related Stories