More

    పేపర్ ప్లేట్లలో అంబేద్కర్ ఫోటోలు.. పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే

    కోనసీమ జిల్లాలోని కొత్తపేట నియోజక వర్గం ముమ్మిడివరం మండలం గోపాలపురం వద్ద ఓ రెస్టారెంట్ లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఫోటోలు ముద్రించిన పేపర్ ప్లేట్లలో ఆహారాన్ని సరఫరా చేసిన అంశం వివాదాస్పదమైంది. ఆ పేపర్ ప్లేట్స్ లో ఫాస్ట్ ఫుడ్ ను తినేశాక వాటిని చెత్తబుట్టలో పడేస్తున్నారు. దీంతో స్థానిక యువకులు ఘర్షణకు దిగారు. అంబేద్కర్ కు అవమానం జరిగిందని వారు నిలదీశారు. ఈ సంఘటనపై పోలీసులు ఇరు వర్గాలకు చెందిన వారి పై కేసు పెట్టారు. 18 మంది దళితులపై కేసు పెట్టారు.

    ఈ ఘటనపై కొత్తపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చిర్ల జగ్గిరెడ్డి పోలీసుల తీరును తప్పుబట్టారు. ఆదివారం సాయంత్రం పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆందోళన చేపట్టారు. రావులపాలెం పోలీస్‌స్టేషన్‌ వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తంచేసి.. ఎస్సై చాంబర్‌ వద్ద బైఠాయించారు. దళితులపై కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రావులపాలెం పీఎస్‌లోనే జగ్గిరెడ్డి నిరసన చేపట్టారు. రాత్రి పోలీస్ స్టేషన్‌లో ఉన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారందరిపై చర్యలు తీసుకునే వరకు పోలీస్ స్టేషన్ లొనే ఉంటానని చెప్పారు. ఈ క్రమంలోనే జగ్గిరెడ్డికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు

    పోలీస్ స్టేషన్లో ధర్నా చేస్తున్న ఎమ్మెల్యే సుఖవంతంగా నిద్రపోయేందుకు పోలీసులు పరుపులు ఏర్పాటు చేశారు. సోమవారం ఉదయం కూడా ఆయన అక్కడే ఉన్నారు. అమలాపురం ఎంపీ చింతా అనురాధ వందలాది మంది కార్యకర్తలతో పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అరెస్టు చేసిన యువకులను రిమాండ్ కు పంపారు. ఎలాంటి ఉద్రిక్త సంఘటనలు జరగకుండా ఎస్పీ సుధీర్ రెడ్డి భారీగా పోలీసు బందోబస్తును జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు.

    ఈ నెల 5న గోపాలపురం‌లో ఒక ఫాస్ట్‌పుడ్‌ సెంటర్‌లో డిస్పోజబుల్‌ ప్లేట్లపై అంబేద్కర్ చిత్రం ఉండటం, వాటిని వియోగించి చెత్త బుట్టలో పడేయడంపై వివాదం తలెత్తింది. దీనిపై ఆందోళనకు దిగిన దళిత యువకులు ఆందోళనకు దిగారు. ఈ వివాదానికి సంబంధించి హోటల్‌ యజమాని, ప్లేట్లు విక్రయించిన వ్యక్తులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 18 మంది దళిత యువకులపై కేసులు నమోదుచేసి రిమాండ్‌కు పంపారు.

    spot_img

    Trending Stories

    Related Stories