వైఎస్‎ఆర్‎సీపీ బైక్ ర్యాలీలో అపశృతి

0
915

అధికార వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. ఎమ్మెల్యే నడుపుతున్న బైక్ పక్కనే ఉన్న మరో బైక్ అనుకోకుండా ఢీకొట్టడంతో ఉమాశంకర్ గణేష్ కిందపడిపోయారు. దీంతో ఆయన కాలికి తీవ్ర గాయమైంది. హుటాహుటిన ఎమ్మెల్యేని నర్సీపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం విశాఖలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

one × 5 =