Telugu States

సంచలన నిర్ణయం తీసుకున్న వైఎస్ విజయమ్మ

వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్న ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైఎస్‌ విజయమ్మ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. వైసీపీ పార్టీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పారు. కుటుంబంలో మనస్పర్థలు ఉన్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వీటికి ముగింపు పలికేందుకు పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన కొడుకు జగన్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తాను పార్టీకి అండగా ఉన్నానని.. తన కూతురు షర్మిల తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీ పెట్టుకుందని, తన తండ్రి వైఎస్ ఆశయాలను సాధించేందుకు పోరాటం చేస్తోందని చెప్పారు. షర్మిలకు అండగా ఉండేందుకు తాను తెలంగాణలో ఉంటానని అన్నారు. ఒంటరి పోరాటం చేస్తున్న షర్మిలకు తన అండ అవసరమని చెప్పారు. తన కొడుకుని మీ అందరి చేతుల్లో పెడుతున్నానని అన్నారు. తల్లిగా జగన్ కు ఎప్పుడూ మద్దతుగా ఉంటానని అన్నారు.

జగన్‌ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారని ప్రశంసించారు విజయమ్మ. ఉద్దండ నాయకులకే వైఎస్‌ జగన్‌ గొంతు ఎండిపోయేలా చేశారని.. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నామన్నారు. మీ అందర్నీ ఆశీర్వదించడానికి, అభినందించడానికి నేను వచ్చానన్నారు. ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని.. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు.

Related Articles

Back to top button