వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భవిష్యత్తుపై తెలంగాణకు చెందిన సీనియర్ పొలిటీషన్ ధర్మపురి శ్రీనివాస్ జోస్యం చెప్పారు. అనారోగ్యానికి శ్రీనివాస్ ను సోమవారం షర్మిల పరామర్శించారు. ఈ సందర్భంగా షర్మిల సీఎం కావడం ఖాయమంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా సీఎం అవుతారని తాను 2003లో చెప్పానని.. 2004లో వైఎస్ సీఎంగా పదవి చేపట్టారని ఆయన చెప్పారు. భవిష్యత్తులో వైఎస్ బిడ్డ షర్మిల కూడా సీఎం అవుతుందని డీఎస్ జోస్యం చెప్పారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్, డీఎస్ కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. వైఎస్ సీఎల్పీ నేతగా ఉండగా… డీఎస్ పీసీసీ చీఫ్గా వ్యవహరించారు. వీరిద్దరి ఉమ్మడి నాయకత్వంలో 2004లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత వైఎస్ సీఎం కాగా… డీఎస్ ఆయన కేబినెట్లో కీలక శాఖల మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీ 2009లో కూడా విజయం సాధించిన సంగతి తెలిసిందే..!