రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే…! దోస్తులు…దుష్మన్లు అవుతారు.. దుష్మన్లు దగ్గరవుతారు.! అధికారమనే మత్తు అవహిస్తే కుటుంబాలే చిన్నభిన్నం అవుతాయి.! ఏపీ సీఎం వైఎస్ జగన్ కు… ఆయన సోదరి షర్మిలకు అసలు పడటం లేదని…, జగనన్న.. తనను పక్కన పెట్టేశాడని, పార్టీలో నంబర్ టు పోజిషన్ ఇస్తానని చెప్పి.., అధికారంలోకి రాగానే అసలు పట్టించుకోవడం లేదని…, అందుకే అన్న మీద కోపంతో ఆమె కొత్త పార్టీ పెట్టబొతుందని… తెలుగునాట అనేక కథనాలు ప్రసారమవుతున్నాయి.
అయితే అన్నమీద కోపం ఉంటే… డైరెక్టుగా అన్న పాలిస్తున్న ఏపీలోనే ఆమె కొత్త పార్టీ పెట్టాలి. కానీ తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేస్తాననడంతో.. దాల్ మే కూచ్ కాలా హై ఎవరికైనా అనిపిస్తుంది.
తెలంగాణలోని ప్రతి జిల్లాలో…మండలంలో, గ్రామంలో మనకు వైఎస్ఆర్ అభిమానులు కనిపిస్తారనేది వాస్తవం.! 2009 తెలంగాణ మలిదశ ఉద్యమం ఊపందుకున్న సమయంలో జగన్ సమైక్యవాదం తీసుకోవడంతో జగన్ ను నమ్ముకుని వైసీపీ లోకి వచ్చిన చాలా మంది నాయకులు ఆ తర్వాత కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో చేరిపోయారు. తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉండే రాష్ట్రంలో…, తెలంగాణ బద్ద వ్యతిరేకైనా…, వైఎస్ఆర్ కుటుంబం నుంచి వచ్చిన షర్మిల ఎంతవరకు రాణిస్తారు.?
అంతేకాదు… ఆడా ఉంటాం…ఈడా ఉంటామన్నట్లుగా వ్యవహారించిన తెలుగుదేశం పార్టీ… తెలంగాణ సెంటిమెంట్ దెబ్బకు…, తెలంగాణలో మొత్తంగానే కనుమరుగైపోయింది. అలాంటిది ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రాంతానికి…అందులోనూ రాయలసీమకు చెందిన క్రైస్తవురాలైన షర్మిల ప్రభావం తెలంగాణాలో ఉంటుందా.. ఒకవేళ ఉంటే ఆమె పార్టీ ఎవరికీ ప్రయోజనకరం,,? షర్మిలను నడిపిస్తున్న శక్తులేవి..? ఆమె అజెండా ఏంటి..? వైఎస్ రాజ శేఖర్ రెడ్డి పై ఉండే అభిమానం షర్మిలపై కొనసాగుతుందా..? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.
తెలంగాణలోని వైఎస్ఆర్ అభిమానులతో షర్మిల వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనాల తర్వాత.., ఆమె పార్టీ పెట్టడం ఖాయమని చెబుతున్నారు. ఇవాళ లోటస్‌పాండ్ కు వచ్చిన సందర్భంలో… షర్మిలా కొత్త పార్టీ ఏర్పాటు విషయాన్ని కూడా కొట్టివేయలేదు. వైఎస్సార్‌లేని లోటు తెలంగాణలో ఉందని…, తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని…, అందుకే అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నానని…, ఆమె చెప్పుకొచ్చారు. అంటే ఆంధ్రాలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజన్న రాజ్యం వచ్చిందని ఆమె చెప్తున్నట్టేనా.. అసలు రాజన్న రాజ్యం అంటే ఏంటి..? షర్మిల రాజకీయ పార్టీ గురించి సొంత పత్రిక సాక్షిలో ఎందుకని హైలైట్ చెయ్యట్లేదు..? తెలుగుదేశానికి దగ్గరగా ఉండే పత్రికల్లో.. ఛానళ్లలో షర్మిలకు ఎందుకు ఎక్కువ ప్రచారం కల్పిస్తున్నారు..?
ఎక్కడో ఎదో తేడాగా అనిపించట్లేదా..?
తెలంగాణలో షర్మిల రాజకీయ ప్రవేశం వెనుక భారీ ప్రణాళిక ఉన్నట్టు అర్థమవుతోంది. షర్మిలకు అన్నమీద తిరుగుబాటు చేసేంత ధైర్యం లేదని.. ఇదంతా జగన్ కు తెలిసే జరుగుతుందనే వారు లేకపోలేదు.
టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో బలమైన శక్తిగా ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.., తెలంగాణ సెంటిమెంట్ అనేది క్రమంగా తగ్గుతు వస్తున్నదని కూడా నిజం. కేసీఆర్ కుటుంబ పాలనపై.., తెలంగాణ ప్రజల్లో ఇప్పుడిప్పుడేు వ్యతిరేకత కనిపిస్తోంది. కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ల సొంత నియోజకవర్గాలను ఆనుకోని ఉన్న దుబ్బాక అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో ప్రజలు అధికార టీఆర్ఎస్ ను ఓడించి బీజేపీని గెలిపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం ఈ వ్యతిరేకత బాగానే కనిపించింది. అయితే ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో..సీమాంధ్రులు ఎక్కువగా నివసించే డివిజనులన్నింటిని టీఆర్ఎస్ గెలుచుకుంది. అధికార టీఆర్ఎస్ కు గట్టిపోటినిచ్చి నంబర్ టు పోజిషన్ ను ఆక్రమించింది బీజేపీ.
దీంతో తెలంగాణ ప్రజల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా స్థిరంగా నిలిచిఉండాలంటే…, రాబోయే ఎన్నికల్లో…తెలంగాణ గడ్డపైనా మరోక సీమాంధ్ర పార్టీ…కొత్తగా పుట్టుకుని వస్తేనే అది సాధ్యమని…, అందుకే తెలంగాణ సీఎంకేసీఆర్…, ఏపీ సీఎం జగన్ కలిసివేసిన స్కేచ్ లో భాగంగానే ఇప్పుడు షర్మిల పార్టీ ప్రకటన అంటున్నారు. షర్మిల పెట్టే పార్టీ పోటీలో ఉంటే… కేసీఆర్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు… గంపగుత్తాగా బీజేపీ వైపు మళ్లకుండా…చీలిపోయే అవకాశాలు ఉంటాయని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. సీమాంధ్రులు బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న నియోజకవర్గాలన్ని కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ఉంటాయి. మొత్తంగా షర్మిల పెట్టే పార్టీ.. 2 నుంచి 4 శాతం ఓట్లు చీల్చే ఛాన్స్ ఉందని.., షర్మిల పార్టీ రాజకీయ రణక్షేత్రంలో ఉంటే… పరోక్షంగా టీఆర్ఎస్ కే మేలు చేయనుందని చెబుతున్నారు. ఇది 2018 ఎన్నికల్లో నిరూపితమైంది కూడా. కాంగ్రెస్-తెలుగుదేశం కలిసి కూటమిగా ఏర్పడిన సమయంలో … కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణపై మళ్ళీ ఆంద్ర పెత్తనం మొదలవుతుందని కేసీఆర్ 2018 ఎన్నికల అజెండానే మార్చారు. దాన్ని ప్రజలు కూడా విశ్వసించినట్టు ఎన్నికల ఫలితాలు చెప్తున్నాయి. ఇప్పుడు షర్మిల రాజన్న రాజ్యం పేరిట.. తెలంగాణ రాజకీయాల్లో బల పడే ప్రయత్నం చేస్తే దాన్ని ఎన్నికల్లో తమకు అనుకూలంగా మలచుకోవడం కేసీఆర్ కు పెద్ద కష్టమేమి కాదు.
అలాగే కొంతమంది షర్మిల నిర్ణయం వెనుక క్రైస్తవ మిషనరీలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మిషనరీల మతమార్పిడి కార్యక్రమాలు ఊపందుకున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఏపీలోనే కాకుండా… ఇటు తెలంగాణలో కూడా జగన్ క్రైస్తవులకు ఒక పొలిటికల్ పేస్ గా మారేందుకు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారని చెప్పేవారు ఉన్నారు. ఏపీలో ఆలయాలపై అప్రతిహతంగా జరుగుతున్నదాడులు.. విచ్చలవిడిగా సాగుతోన్న మత మార్పిడులు.. పాస్టర్లకు ప్రత్యేక తాయిలాలు.. ఇవన్నీ ఈ క్రమంలో సాగుతున్నవేననే అభిప్రాయము ఉంది. అపిషియల్ గానే ఒక పొలిటికల్ పార్టీ తమకు అండగా ఉంటే తప్పేంటని మిషనరీ వర్గాల్లో పెద్దఎత్తున చర్చలు జరిగాయని అంటున్నారు.
ఎలాగైతే ఎంఐఎం పార్టీ…, ఒక్క తెలంగాణలోనే కాకుండా… దేశ వ్యాప్తంగా… ముస్లింల పార్టీగా ఆ సమాజంలో బలంగా విస్తరించే ప్రయత్నం చేస్తోందో…, అలాగే జగన్ కూడా విస్తరణ కోసం వ్యూహ రచన చేశారని అంటున్నారు. క్రైస్తవులకంటూ ఒక పొలిటికల్ పార్టీ ఉంటే తప్పేంటని., అందులోనూ బలమైన రాజకీయ సామాజిక నేపథ్యం ఉన్న వైఎస్ కుటుంబం నుంచి వచ్చిన వారికే ఇది సాధ్యపడుతుందనే వారు ఉన్నారు. షర్మిల తమ నాయకురాలిగా ఉంటే…, ఇక తెలంగాణలో తమకు తిరుగు ఉండదని.., మత మార్పిడి విస్తరణ కార్యక్రమాలకు తమకు పొలిటికల్ గా అండ దొరుకుతుందనే భావనలో క్రైస్తవ మిషనరీ వర్గాలు ఉన్నాయని కొంతమంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
లోటస్ పాండ్ సమావేశానికి వచ్చిన సందర్భంలో.., షర్మిల వెంట ఆమె భర్త… క్రైస్తవ మత ప్రచారకుడు అనిల్ కుమార కూడా ఉన్నాడు. అలాగే వైఎస్ అభిమానాలను కలుసుకోవడం దగ్గర నుంచి జిల్లాల్లోని ముఖ్యనేతలతో మాట్లాడటం…, వారిని హైదరాబాద్ కు ఆహ్వానించడం వరకు అన్ని వ్యవహారాలు బ్రదర్ అనిల్ నేతృత్వం, ఆయన మార్గదర్శకత్వంలోనే జరిగిన విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు.
మోడీ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆమ్నెస్టీ మొదలుకుని చిన్న చిన్న మిషనరీల దాకా మత మార్పిడుల కోసం ఇబ్బడి ముబ్బడిగా విదేశాల నుంచి వస్తున్న డబ్బుని కట్టడి చేస్తూ మత మార్పిడి ముఠాలకు చెక్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో క్రైస్తవ మిషనరీలకు తమ ప్రయోజనాలు కాపాడే విధంగా ఉండే ఒక పొలిటికల్ ఫేస్ అవసరం ఏర్పడింది. రాజ శేఖర్ రెడ్డి మరణం తర్వాత ముఖ్యమంత్రి కావాలనుకున్న జగన్ ని కాంగ్రెస్ అధిష్టానం పక్కన పెట్టడంతో జగన్ పార్టీ పెట్టి ప్రజల్లోకి వెళ్లారు. అనేక ప్రయత్నాల తర్వాత 2019లో ప్రజలు ఆశిర్వదించడంతో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో ఏ లక్ష్యంతోనైతే పార్టీ పుట్టిందో ఆ లక్ష్యం నెరవేరినట్లైంది. ఇప్పుడు మరో లక్ష్యాన్ని ఏర్పరచుకుని రాజకీయంగా విస్తరించాలని వైఎస్ కుటుంబం భారీ పతక రచన చేసిందనేది ఇప్పుడు ఉత్కంఠభరితంగా మారిన అంశం.
మొత్తంగా ఓదార్పు యాత్ర సమయంలో “నేను జగనన్న వదిలిన బాణాన్ని” అని గర్వంగా చెప్పుకున్న షర్మిల నేడు జగనన్న ఆశీర్వాదం ఉందనే అనుకుంటున్నా అంటూ ఒక సందేహాన్ని ప్రజల్లోకి జొప్పించిన విధానం చూస్తుంటే…అనేక అనుమానాలు కలుగుతున్నాయి.
ఇంతకీ షర్మిల జగన్ వదిలిన బాణమా .. కేసీఆర్ వ్యూహంలో భాగమా.. లేక కేవలం క్రైస్తవ మిషనరీల ప్రయోజనాల కోసమా..?
Just Asking