ప్రధాని మోదీ విశాఖ టూర్‌పై సీఎం జగన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. దేశప్రగతి రథసారథి మెదీకి ఏపీ ప్రభుత్వం తరపున స్వాగతం చెప్పిన సీఎం జగన్… రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినందుకుగాను మోదీకి రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంతో వారికి ఉన్న అనుబంధం రాజకీయాలకు అతీతమైనదిగా వర్ణించారు. తమకు రాష్ట్ర ప్రయోజనాలు తప్ప మరో ఎజెంగా లేదని జగన్ చెప్పారు. అదేవిధంగా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా పోలవరంతో పాటు ప్రత్యేక హోదా వరకు కేంద్రానికి విన్నవించిన పలు అంశాలను మరో సారి పరిశీలించాలని, సభా వేదికగా ప్రధాని మెదీని కోరారు.