More

    మరోసారి దుష్ట చతుష్టయం అంటూ విరుచుకుపడ్డ ఏపీ సీఎం

    ఏలూరు జిల్లా గణపవరంలో ‘వైఎస్సార్‌ రైతు భరోసా’ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల గురించి ఆలోచన చేయనని.. ప్రజలకు మంచి చేయాలన్నది తన తపన అని చెప్పుకొచ్చారు. వ్యవసాయం దండగ అన్ననాయకుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?. రైతుల ఉచిత విద్యుత్‌, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతులపై కాల్పులు జరిపించిన నాయకుడు, రుణాల పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను ఒకసారి గుర్తుచేసుకోవాలన్నారు. చంద్రబాబు హయాంలో రైతులను మోసం చేస్తే దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని, ఇక ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమై ప్రేమ చూపించాడని వైఎస్ జగన్ విమర్శించారు. అప్పుడు చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదని సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్‌ కోరారు. రైతుల పరామర్శ యాత్ర అంటూ దత్తపుత్రుడు బయల్దేరాడని.. పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందని ఒక్కరిని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడన్నారు వైఎస్ జగన్. ప్రస్తుతం వీరంతా మొసలి కన్నీరు కారుస్తున్నారు. మన ప్రభుత్వంలో ఎక్కడా లంచాలు లేవు. వివక్ష లేదు. ఓటు వేసినా వేయకపోయినా మంచి చేసే పని జరుగుతోందని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పుకొచ్చారు.

    వైఎస్సార్‌ రైతు భరోసా కింద 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హత పొందిన 50,10,275 రైతు కుటుంబాలకు తొలి విడతగా రూ.3,758 కోట్ల పెట్టుబడి సాయం ప్రభుత్వం అందించింది. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన వేదికపై నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేశారు.

    Trending Stories

    Related Stories