ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన సీఎం వైఎస్ జగన్

0
714

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఏపీ సమస్యలపై సీఎం జగన్ ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో చర్చించారు. పోలవరం ప్రాజెక్టు, జల వివాదాలకు సంబంధించిన అంశాలను ప్రధాని ఎదుట ప్రస్తావించారు. విభజన హామీలు నెరవేర్చాలని కోరారు.

ప్రధాని మోదీతో భేటీ అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో సమావేశం ముగిసిన అనంతరం నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లారు. ఆయన వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, అవినాశ్ రెడ్డి, వేంరెడ్డి, గోరంట్ల మాధవ్ ఉన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి మరింత ఆర్థికసాయం చేయాలని నిర్మలా సీతారామన్ ను కోరారు. వచ్చే బడ్జెట్ లో పోలవరం, కేంద్ర సంస్థలకు నిధులు ఇవ్వాలని తెలిపారు.

జగన్ ఇవాళ పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరితో ఆయన భేటీ కానున్నారు. ఆ తర్వాత ఉదయం పదిన్నర గంటలకు ధర్మేంద్ర ప్రధాన్‌తోనూ.. మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు అనురాగ్ ఠాగూర్‌తో సీఎం భేటీ కానున్నారు.