ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయ్యింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గన్నవరం నుంచి ఢిల్లీ బయలుదేరివెళ్లారు. అయితే విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అందులో సాంకేతిక లోపం తలెత్తినట్టు సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే తిరిగి గన్నవరం విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
ఐతే రేపు సీఎం వైయస్ జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగనుంది. రాత్రికి జన్‌పథ్ నివాసంలో సీఎం వైఎస్ జగన్ బస చేయాలి. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్‌రైజర్ కార్యక్రమాలకు సీఎం వైయస్ జగన్ హాజరుకానున్నారు. ఎల్లుండి 10.30 నుంచి 5-30 గంటల వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హెటల్‌లో దౌత్యవేత్తలతో సీఎం వైయస్ జగన్ సమావేశమవుతారు. ఉదయం వినుకొండ పర్యటనలో పాల్గొని అక్కడి నుండి తాడేపల్లికి చేరుకుంటారు జగన్.
ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్ మెంట్ కూడా కోరినట్లుగా తెలుస్తోంది. అయితే అపాయింట్‌మెంట్లు ఇంకా ఖరారుకాలేదు. కాగా 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. అదే రోజు సాయంత్రం 3.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఉంది. ఈలోపే విమానంలో సాంకేతిక లోపం రావడంతో ఆయన షెడ్యూల్ మారే అవకాశం ఉంది.