More

    కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్న సీఎం జగన్

    ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జగనన్న విద్యా కానుకను ప్రారంభించనున్నారు. సీఎం జగన్ మంగళవారం ఉదయం 8.30 గంటలకు సీఎం తన నివాసం నుంచి బయలుదేరి 8.50 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 9 గంటలకు విమానంలో బయలుదేరి 9.50కి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 10 గంటలకు హెలికాప్టర్‌లో బయలుదేరి 10.20కి ఆదోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స కళాశాల మైదానానికి చేరుకుంటారు. 10.20 నుంచి 10.30 గంటల వరకు ప్రజల నుంచి వినతులు తీసుకుంటారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా 10.40కి మున్సిపల్‌ క్రీడా మైదానానికి చేరుకుంటారు. 10.45 నుంచి 10.50 వరకు పాఠశాలను సందర్శిస్తారు. 10.55 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకుని 11.15 వరకు నాయకులు, అధికారులతో మాట్లాడతారు. 11.15 నుంచి 11.25 వరకు వివిధ పథకాల లబ్ధిదారులు మాట్లాడుతారు. 11.25 నుంచి 12.10 వరకు ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. 12.10 నుంచి 12.20 వరకు జగనన్న విద్యాకానుకను పంపిణీ చేస్తారు. 12.20 గంటలకు మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానం నుంచి రోడ్డు మార్గంలో ఆర్ట్స్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు. 12.30 నుంచి 12.45 వరకు స్థానిక నాయకులతో మాట్లాడుతారు. 12.50కు హెలికాప్టర్‌లో బయలుదేరి 1.10 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 1.20 గంటలకు ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరుతారు. మధ్యాహ్నం 2.10 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.

    spot_img

    Trending Stories

    Related Stories