More

    డిసెంబరు 5న ఢిల్లీ పర్యటనకు ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు

    ఏపీ సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు డిసెంబరు 5న ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ ఏడాది జీ20 దేశాల అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కేంద్రం దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సదస్సులు, సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించే సదస్సుకు రావాలని పలువురికి ఆహ్వానాలు అందాయి. జీ20 దేశాల సదస్సు తీరుతెన్నులు, అజెండాపై ఈ సమావేశంలో ప్రధాని మోదీ రాజకీయ పార్టీల నేతలతో చర్చించనున్నారు. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులకు పిలుపు అందింది. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులతో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఆహ్వానాలు అందాయి.

    Trending Stories

    Related Stories