More

    ప్రధాని నరేంద్ర మోదీతో ముగిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ

    భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్బంగా పోలవరానికి నిధులు ఆలస్యం చేయకుండా విడుదల చేయాలని ప్రధానిని సీఎం జగన్‌ కోరారు. నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీని వీలైనంత త్వరగా ఇవ్వాలని సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం వైఎస్‌ జగన్‌ చర్చించారు. మోదీతో భేటీ సమయంలో జగన్ వెంట వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు.

    మధ్యాహ్నం 1.30 గంటలకు కేంద్ర విత్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో సీఎం జగన్ భేటీ కానున్నారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుంటారు. ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ కర్ ను కూడా కలవబోతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఆయన పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.

    spot_img

    Trending Stories

    Related Stories