Telugu States

ప్రధాని మోదీకి లేఖ రాసిన వైఎస్ జగన్.. ప్రశంసల జల్లు

భారతప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. పేదలందరికీ ఇళ్లు ఉండాలనే సంకల్పంతో ప్రధాని మోదీ బృహత్కరమైన కార్యక్రమాన్ని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాల్లో కొన్ని లక్షల ఇళ్లను నిర్మిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా పెద్ద ఎత్తున పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా.. పక్కా ఇళ్ల నిర్మాణం కొనసాగుతూ ఉంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అమ‌లవుతోన్న ‘పేదలందరికీ ఇళ్లు-పీఎంఏవై’ ప్రధాని మోదీకి వైఎస్ జగన్‌ లేఖ రాశారు. 2022 లోపు ఈ ప‌థ‌కం కింద ఇళ్ల నిర్మాణాల‌ను పూర్తి చేయాలన్న మోదీ సంకల్పం చాలా గొప్పదని ఆయ‌న ప్రశంసించారు. ఏపీలో ల‌క్ష్యాన్ని చేరుకునేందుకు 68,381 ఎకరాల భూమిని పంచామ‌ని జగన్‌ వివ‌రించారు. 17,005 గ్రీన్‌ఫీల్డ్‌ కాలనీల్లో ఇప్ప‌టివ‌ర‌కు 30.76 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చిన‌ట్లు ఆయ‌న వివ‌రించారు. వాటిల్లో 28.35 లక్షల పక్కా ఇళ్లను నిర్మించాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పేద‌ల‌కు ఇళ్లు నిర్మించి ఇవ్వ‌డానికి రూ.50,944 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నామని.. ఇళ్ల నిర్మాణంతో పాటు పేద‌ల‌కు మౌలిక వసతులు కల్పించడం కోసం రూ.34,104 కోట్ల నిధులు అవసరమవుతాయని ఆయ‌న మోదీకి లేఖ‌లో వివరించారు. ఇప్ప‌టికి తాము రూ.23,535 కోట్లు ఖర్చు చేశామ‌ని, ఇది రాష్ట్రానికి భారం అవుతుందని జగన్‌ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు కేంద్ర ప్ర‌భుత్వం అండగా ఉండాలని.. ఈ మేర‌కు రాష్ట్రానికి నిధులు అందేలా చేయాల‌ని వైఎస్ జగన్ కోరారు.

పేదల కోసం నిర్మించే గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస వసతులను కల్పించే విషయంలో గృహాలు పట్టణ వ్యవహారాలు, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కనిపించట్లేదని పేర్కొన్నారు. ఈ రెండు శాఖలను అనుసంధానిస్తూ గ్రీన్‌ఫీల్డ్ కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉమ్మడి మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్ ప్రధాని మోదీని కోరారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 1 =

Back to top button