More

    రోడ్ల విషయంలో.. గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సీఎం జగన్

    టీడీపీ ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలను తమ ప్రభుత్వం పూర్తీ చేయాల్సి వస్తోందని అన్నారు. రెండేళ్లుగా భారీ వర్షాల వల్ల రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని వాటి మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జగన్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. రోడ్లు ఏ దశలో కూడా నిర్లక్ష్యానికి గురి కాకుండా క్రమం తప్పకుండా మెయింటెనెన్స్ పనులు నిర్వహించాలని జగన్ చెప్పారు. జగనన్న కాలనీల్లో రక్షిత మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

    పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సోమవారం సమీక్ష చేపట్టారు. ఈ శాఖల పరిధిలో వివిధ కార్యక్రమాలను సమగ్రంగా సమీక్షించిన సీఎం పలు ఆదేశాలు ఇచ్చారు. జాతీయ ఉపాధిహామీ పథకం పనులు, జగనన్న పచ్చతోరణం, వైఎస్సార్‌ జలకళ, గ్రామీణ ప్రాంతాల్లో క్లాప్‌ కింద కార్యక్రమాలు, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, గ్రామీణ మంచినీటి సరఫరా తదితర కార్యక్రమాలపై సీఎం సమీక్షించారు. ప్రాధాన్యతా క్రమంలో ఉపాధిహామీ పనులు చేపట్టాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, వైయస్సార్‌ హెల్త్‌ క్లినిక్, వైయస్సార్‌ డిజిటల్‌ లైబ్రరీల పూర్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్రానికి వస్తున్న నిధులను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్యతా క్రమంలో వీటిని పూర్తిచేయాలని సూచించారు.

    Trending Stories

    Related Stories