More

    సల్మాన్ ఖాన్ వి అయినా ఐడీ కార్డు చూపించాల్సిందే..!

    బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే ఇదేదో సాంగ్-ట్రైలర్ లాంటిది కాదు. ముంబై విమానాశ్రయంలోకి ప్రవేశించే ముందు భద్రతా తనిఖీలను పూర్తి చేయడానికి సిఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్ ను ఆపివేశారు. ఐడీ ప్రూఫ్ చూపించి వెళ్లాలని సల్మాన్ ఖాన్ ను సిఐఎస్ఎఫ్ అధికారి కోరారు. సల్మాన్ ఖాన్ తన రాబోయే చిత్రం టైగర్ 3 చిత్రీకరణ కోసం రష్యా వెళ్లేందుకు ముంబై విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తుంది.

    అతను విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు సల్మాన్ ఖాన్ ప్రవేశద్వారం వద్ద భద్రతా తనిఖీని పూర్తి చేయకుండా విమానాశ్రయం లోపలికి నడవటానికి ప్రయత్నించాడు. ఫోటోగ్రాఫర్‌లు చిత్రాల కోసం సల్మాన్ ఖాన్ ను అడుగుతుండగా సల్మాన్ ఖాన్ తన పరివారంతో భద్రతా సిబ్బందిని పట్టించుకోకుండా లోపలికి వెళ్ళబోయాడు. అయితే అక్కడే విధుల్లో ఉన్న సీఐఎస్ఎఫ్ అధికారి సల్మాన్ ను ఆపేశాడు. తన ఐడెంటీని కన్ ఫర్మ్ చేసుకోవాలని సల్మాన్ కు చూపించాడు. ఒక యువ CISF ఆఫీసర్ సల్మాన్ ఖాన్‌ను విమానాశ్రయంలోకి రాకుండా ఆపి, లైన్‌లో ఉండమని వెనుక ఉన్న వాళ్లను కోరారు. ముందుగా తన భద్రతా తనిఖీని పూర్తి చేయమని సల్మాన్ ఖాన్ ను కోరుతూ కనిపించాడు. CISF అధికారి సల్మాన్ ఖాన్‌ను ఆపి భద్రతా తనిఖీని పూర్తి చేయమని కోరి, ఫోటోగ్రాఫర్‌లను ఒక అడుగు వెనక్కి వెళ్లమని కోరడం కూడా జరిగింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది, ప్రముఖ బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని పోస్ట్ చేసారు. ఈ ఒక్క ఘటనతో సిఐఎస్ఎఫ్ అధికారి కాస్తా హీరో అయ్యాడు. రూల్స్ అందరికీ ఒకటేనని అతడు నిరూపించాడని పలువురు సోషల్ మీడియాలో ఈ వీడియోను షేర్ చేశారు. ఆ సిఐఎస్ఎఫ్ అధికారి తన డ్యూటీ తను చేశాడు. తనకు కామన్ మ్యాన్ అయినా సెలబ్రిటీ అయినా ఒక్కటే అని ప్రూవ్ చేశాడు. కామన్ మ్యాన్ కి ఏ రూల్స్ అయితే వర్తిస్తాయో అవే సల్మాన్ కి అవే వర్తిస్తాయని చెప్పడమే కాకుండా.. తన ఐడెంటీ కన్ ఫర్మ్ చేసుకోవాలని సల్మాన్ కి చెప్పి.. ఆ తర్వాతనే సల్మాన్ ఖాన్ ని ఎయిర్ పోర్టులోని వెళ్లనిచ్చాడు.

    Trending Stories

    Related Stories