More

    100 రోజులు.. 525 ఎన్‎కౌంటర్లు..! యూపీ సీఎం యోగి 2.O రికార్డ్..!!

    యూపీ సీఎం యోగి దేశ రాజకీయాల్లో ఓ ప్రభంజనం.. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి జులై 5వ తేదీకి వంద రోజులు పూర్తి అయ్యింది. అయితే ఈ వంద రోజుల పాలనలో ఆయన రికార్డు ఆయనే బ్రేక్ చేశారు. ముఖ్యంగా నేరస్థులు, రౌడీ షీటర్ల పాలిట ఆయన సింహ స్వప్నంలా నిలిచారు.

    ఈ వంద రోజుల్లో యూపీలో 525 పోలీసు ఎన్ కౌంట‌ర్లు న‌మోదు కావ‌డం దేశ చ‌రిత్ర‌లోనే ఇదో రికార్ట్‌. మార్చి 25న ప్రమాణస్వీకారం చేసిన ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం జూలై 5న 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా క్రైమ్ రికార్డ్ ను విడుద‌ల చేశారు. ముఖ్యమంత్రి ఉచిత రేషన్ అందించడం.. మైదానం ఏర్పాటు చేయడంతో పాటు పలు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావడానికి బ్రేకింగ్ వేడుక మరో ప్ర‌త్యేకం. మొదటి టర్మ్‌లో, యోగి ప్రభుత్వ ప్రధాన ఎజెండా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిని మెరుగుపరచడం. నేరగాళ్లపై ఉక్కుపాదం మోపడం, మాఫియాల అక్రమ ఆస్తులను ధ్వంసం చేయడం ద్వారా ప్రభుత్వం ఐదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసింది. రాష్ట్ర ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజులలో శాంతిభద్రతలను మరింత మెరుగుపరచడానికి తీవ్రంగా శ్రమించారు.

    పోలీస్ చర్యలు గణాంకాల ప్రకారం మార్చి 25వ తేదీ నుంచి జులై 1వరకు మొత్తం 525 ఎన్ కౌంటర్లు జరిగాయి. దాదాపు వెయ్యి 34మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. ఇక ఎన్ కౌంటర్ లో 425మంది దుర్మార్గులు గాయపడ్డారు. అటు పోలీస్ ఎన్ కౌంటర్ లో లిస్ట్ లో ఐదుగురు నేరస్తులు హత్యకు గురయ్యారు. అయితే ఈ ఎన్ కౌంటర్లలో దాదాపు 68మంది పోలీసులు గాయపడ్డారు. ఒక్క మీరట్ జోన్లలోనే గరిష్టంగా 193 ఎన్ కౌంటర్లు జరిగాయి. బరేలీ జోన్ లో 62, ఆగ్రా జోన్ లో 48, లక్నో జోన్ లో 48, లక్నో కమిషనరేట్ పరిధిలో 6, వారణాసి జోన్ లో 36, గోరఖ్‌పూర్ జోన్ లో 37, నోయిడా కమిషనరేట్ పరిధిలో 44 ఎన్ కౌంటర్లు జరిగాయి.

    రెండో టర్మ్‌లో యూపీ పోలీసులు కూడా అనేక మాఫియాలను గుర్తించారు. రాష్ట్ర స్థాయిలో గుర్తించిన 50 మాఫియాలతో పాటు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రధాన కార్యాలయం కూడా 12 మాఫియాలను గుర్తించింది. 2022 మార్చి నుంచి జూన్ వరకు గ్యాంగ్‌స్టర్ చట్టం కింద రూ.190 కోట్లకు పైగా విలువైన 582 ఆస్తులు జప్తు చేశారు. రాష్ట్ర స్థాయిలో ఈ 50 మాఫియాలు కాకుండా, ప్రధాన కార్యాలయ స్థాయిలో 12 గ్యాంగ్‌స్టర్ల నుండి రూ.92 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. డీజీపీ ప్రధాన కార్యాలయం విడుదల చేసిన డేటా ప్రకారం మోసగాళ్లు, మాఫియాకు చెందిన వారిగా రెండు వేల 433 గ్యాంగ్ లను గుర్తించారు. అందులో 17 వేల 169మందిపై కేసులు నమోదు అయ్యాయి. ఇక దాదాపు వెయ్యి 645మందిని అరెస్ట్ చేశారు. 134 కోర్టులో లొంగిపోయారు. 15మంది నేరస్తులపై అటాచ్ మెంట్ చర్యలు తీసుకున్నారు. అటు 36మంది జాతీయ భద్రతా చట్టం ప్రయోగించారు.

    అయితే యూపీ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అనేక సంఘటనలు రాష్ట్రంలోని శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాయి. ఈ సంఘటనలలో లలిత్‌పూర్‌లోని పాలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన గ్యాంగ్ రేప్ కేసు.. కాన్పూర్, ప్రయాగ్‌రాజ్, సహరాన్‌పూర్, మొరాదాబాద్‌తో సహా అనేక నగరాల్లో శుక్రవారం ప్రార్థనల తర్వాత జూన్ మొదటి వారంలో హింస చెలరేగింది. రాళ్లు రువ్వడం, విధ్వంసం వంటి సంఘటనలు కూడా నమోదయ్యాయి. దీనికి తోడు, అగ్నిపథ్ పథకం ప్రారంభించిన తర్వాత అనేక నగరాల్లో నిరసనలు చెలరేగాయి. పెద్దఎత్తున నిరసనలతో కోట్లాది ఆస్తి నష్టం జరిగింది. మరోవైపు యూపీలో మసీదులలో లౌడ్ స్పీకర్ల తొలగింపు పై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాదాపు లక్షా 20వేల లౌడ్ స్పీకర్లు తొలగించారు.

    spot_img

    Trending Stories

    Related Stories