అయోధ్యలో ప్రభు శ్రీరాముడి పేరుతో విశ్వవిద్యాలయం

0
723

అయోధ్యలో భవ్యమైన రామాలయమే కాదు…! భవ్యమైన వర్శిటీని సైతం ఏర్పాటు చేస్తోంది యూపీలోని యోగి సర్కార్. అంతేకాదు ఆ విశ్వవిద్యాలయానికి లార్డ్ శ్రీరామ యూనిర్శిటీగా నామాకరణం చేయనుంది.

రామాయణం… జీవన మూల్యాలు… రామ రాజ్యం.. హిందూ ధర్మ వైశిష్ట్యానికి సంబంధించిన విషయాలే ప్రధాన సబ్జెక్టులుగా ఈ నూతన యూనివర్శిటీలో బోధన చేసేందుకు యూపీ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. భారతీయ ఆచారాలు…అందులోని సైన్సుకు అందని మర్మాలు…, ఇంకా ప్రాచీన భారతీయ గ్రంథాల్లోని వైజ్ఞానికి అంశాలపై ఈ లార్డ్ శ్రీరామ యూనిర్శిటీ కేంద్రంగా పరిశోధనలు సైతం నిర్వహించేందుకు అవకాశం ఉంటుందని యూపీ డిఫ్యూటీ సీఎం డాక్టర్ దినేశ్ శర్మ తెలిపారు.

అంతేకాదు లార్డ్ శ్రీరామ యూనివర్శిటీతోపాటు, స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఆయూష్ యూనివర్శిటీ, అలాగే లా యూనివర్శిటీని సైతం ఏర్పాటు చేసేందుకు 16 మంది సభ్యులతో కూడిన టాస్క్ ఫోర్స్ టీమ్ ను యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నూతన జాతీయ విద్యావిధానంలో భాగంగా..  హైయర్ ఎడ్యుకేషన్ , సెకండరీ ఎడ్యుకేషన్, బెసిక్ ఎడ్యూకేషన్, టెక్నకల్  ఎడ్యుకేషన్ కమిటీలను సైతం యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రస్తుతం యూపీలో 23 విశ్వవిద్యాలయాలు అలాగే ఆరు కేంద్ర విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. 

మరోవైపు ప్రపంచ పర్యటానికి అయోధ్యను కేంద్ర బిందువుగా చేయాలనే తలంపుతో యోగి ప్రభుత్వం… అయోధ్య కేంద్రంగా రూ. 2 వేల కోట్ల రూపాయలతో అనేక అభివృద్ధి పథకాలకు శ్రీకారం చుట్టుంది.  అంతర్జాతీయ ప్రమాణాలతో…అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విమానాశ్రయాన్ని నిర్మిస్తోంది. ఈ విమానాశ్రయానికి మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ ఎయిర్ పోర్ట్ అని పేరు పెట్టనుంది.  మల్టీ లెవల్ పార్కింగ్ సిస్టమ్ , అలాగే ఆధునిక బస్ స్టేషేన్లు ఏర్పాటు చేస్తోంది.

ఇంకా ప్రతి ఏటా పంచకోసి , చౌదా కోసి, చౌరాసి కోసి పరిక్రమణ చేసిన తర్వాత చాలా మంది భక్తులు అయోధ్య రామ్ లాలా దర్శనం కోసం వస్తుంటారు. దీనిని దృష్టిలో ఉంచుకుని యోగి ప్రభుత్వం…. పరిక్రమణ చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా… రహదారులను వెడల్పు చేస్తోంది. అలాగే అయోధ్యను అనుకుని ప్రవహించే సరయూనది నీటి శుభ్రతపై కూడా యోగి ప్రభుత్వం దృష్టిని సారించింది. గుప్తార్ ఘాట్ నుంచి… నయా ఘాట్ మధ్య రివర్ ఫ్రంట్ ను నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. అటు రామ్ కథా పార్క్ నిర్మాణం కూడా వేగంగా సాగుతోంది.

మరోవైపు అయోధ్య నగరాన్ని అందంగా ముస్తాబు చేసేందుకు… , ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేందుకు… ఐఐఎం ఇండోర్ తో అయోధ్య మున్సిపల్ కార్పొరేషన్ అవగాహన ఒప్పందం కూడా కుదర్చుకుంది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

fourteen − 1 =