More

    తాలిబాన్లు తోకజాడిస్తే ఎయిర్ స్ట్రైక్స్ తప్పవని హెచ్చరించిన యోగి ఆదిత్యనాథ్

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తాలిబాన్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ ను ఇప్పటికే తాలిబాన్లు సొంతం చేసుకుని పరిపాలన చేస్తూ ఉన్నారు. ఆర్థికంగా దిగజారిపోయింది ఆఫ్ఘనిస్తాన్.. ఎలాగైనా బయటపడాలని వారు భావిస్తూ ఉన్నారు. భారత్ లో తాలిబాన్లు ఇబ్బందులను సృష్టించే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంచనా వేస్తున్నాయి. పాక్ తో కలిసి తాలిబాన్లు కుట్రలకు పాల్పడే అవకాశం ఉందని అంటున్నారు.

    ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ తాలిబాన్ల వల్ల ఆఫ్ఘనిస్తాన్, పాక్ రెండు దేశాలు ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. భారత్ వైపు రావాలని తాలిబాన్లు ప్రయత్నిస్తే… ఎయిర్ స్ట్రయిక్స్ ను ఎదుర్కోవడానికి సిద్ధం కావాలని హెచ్చరించారు. యోగి ఆదిత్యనాథ్ ఆదివారం నాడు మాట్లాడుతూ పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ల వల్ల కలవరపడుతున్నాయని అన్నారు. సామాజిక ప్రతినిధి సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. ‘ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో నేడు భారతదేశం శక్తివంతంగా ఉంది, ఏ దేశమూ భారత్‌ వైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేకపోతోంది. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లు తాలిబాన్‌ల వల్ల కలవరపడుతున్నాయి. కానీ, తాలిబాన్‌లు భారత వైపు కదిలితే భారతదేశం వైమానిక దాడి చేయడానికి సిద్ధంగా ఉంది” అని చెప్పుకొచ్చారు యోగి.

    రాష్ట్రంలోని తన రాజకీయ ప్రత్యర్థులను కూడా తీవ్రంగా విమర్శించారు. సహుల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ SBSP చీఫ్ ఓం ప్రకాష్ రాజ్‌భర్‌ పై కూడా యోగి విమర్శలు గుప్పించారు “అతని (రాజ్‌భర్) ఆలోచనా విధానం అతని కుటుంబ అభివృద్ధికి మాత్రమే పరిమితమైంది. తండ్రి మంత్రి కావాలనుకున్నప్పుడు, ఒక కొడుకు ఎంపీ కావాలని, మరొకరు ఎమ్మెల్సీ కావాలని కోరుకున్నారు. బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే వారి దుకాణాలు మూసివేయాలి” అని ఆదిత్యనాథ్ అన్నారు.

    Related Stories