యూపీ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన యోగి ఆదిత్యనాథ్.. మంత్రులెవరంటే

0
859

రెండోసారి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం లక్నోలోని భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి ఏకనా స్టేడియంలో యోగి ఆదిత్యనాథ్ కేబినెట్ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గ సహచరులతో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ప్రమాణ స్వీకారోత్సవాన్ని తిలకించేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు పెద్ద ఎత్తున స్టేడియంకు చేరుకున్నారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హర్యానా సీఎం ఎంఎల్ ఖట్టర్, హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ తదితరులు పాల్గొన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోదీని కలిసి ఆశీస్సులు కోరారు.

ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బీజేపీ సీనియర్ నేత కేశవ్ ప్రసాద్ మౌర్య మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. లక్నో కంటోన్మెంట్ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందిన బ్రజేష్ పాఠక్ రాష్ట్రానికి మరో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన ఇతర బీజేపీ నేతల్లో లక్ష్మీ నారాయణ్ చౌదరి, జైవీర్ సింగ్, ధరమ్ పాల్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర ఉపాధ్యాయ ఉన్నారు. యూపీలో బీజేపీ మిత్రపక్షం, కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ భర్త ఆశిష్ పటేల్, నిషాద్ పార్టీకి చెందిన సంజయ్ నిషాద్ కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడిన బీజేపీ నేత జితిన్ ప్రసాద కూడా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. యోగి ఆదిత్యనాథ్‌తో పాటు మొత్తం 16 మంది కేబినెట్ మంత్రులు, 14 మంది రాష్ట్ర మంత్రులు (స్వతంత్ర బాధ్యతలు), 20 మంది రాష్ట్ర మంత్రులు కూడా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రానికి ఇద్దరు ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ ప్రమాణ స్వీకారం చేశారు.

క్యాబినెట్ మంత్రులు
సూర్య ప్రతాప్ షాహి, సురేష్ కుమార్ ఖన్నా, స్వతంత్ర దేవ్ సింగ్, బేబీ రాణి మౌర్య, లక్ష్మీ నారాయణ్ చౌదరి, జయవీర్ సింగ్, ధరంపాల్ సింగ్, నంద్ గోపాల్ గుప్తా, భూపేంద్ర సింగ్ చౌదరి, అనిల్ రాజ్‌భర్, జితిన్ ప్రసాద, రాకేష్ సచన్, అరవింద్ కుమార్ శర్మ, యోగేంద్ర యుపాధ్యా ఆశిష్ పటేల్, సంజయ్ నిషాద్.

రాష్ట్ర మంత్రి (స్వతంత్ర బాధ్యత)
నితిన్ అగర్వాల్, కపిల్ దేవ్ అగర్వాల్, రవీంద్ర జైస్వాల్, సందీప్ సింగ్, గులాబ్ దేవి, గిరీష్ చంద్ర యాదవ్, ధర్మవీర్ ప్రజాపతి, అసిమ్ అరుణ్, JPS రాథోడ్, దయాశంకర్ సింగ్, నరేంద్ర కశ్యప్, దినేష్ ప్రతాప్ సింగ్, అరుణ్ కుమార్ సక్సేనా, దయాశంకర్ మిశ్రా దయాలు.

రాష్ట్ర మంత్రి
మయాంకేశ్వర్ సింగ్, దినేష్ ఖతీక్, సంజీవ్ గోండ్, బల్దేవ్ సింగ్ ఓలాఖ్, అజిత్ పాల్, జస్వంత్ సైనీ, రాంకేశ్ నిషాద్, మనోహర్ లాల్ మన్ను కోరి, సంజయ్ గంగ్వార్, బ్రిజేష్ సింగ్, KP సింగ్, సురేష్ రాహి, సోమేంద్ర తోమర్, అనూప్ ప్రధాన్ వాల్మీకి, ప్రతిభా స్హుక్ , రాకేష్ రాథోడ్ గురు, రజనీ శర్మ, సతీష్ శర్మ, డానిష్ ఆజాద్ అన్సారీ, విజయ్ లక్ష్మీ గౌతమ్.