National

కరోనా కట్టడికి వినూత్న ఆలోచన చేసిన యోగి ఆదిత్యనాథ్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రామాల్లో కరోనా మహమ్మారి ప్రబలకుండా ఉండడానికి వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ‘మేరా గావ్.. కరోనా ముక్త్ గావ్'(మా గ్రామం.. కరోనా రహిత గ్రామం) అనే క్యాంపెయిన్ ను ఆదిత్యనాథ్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమం ద్వారా కరోనా మహమ్మారి గ్రామాల్లో పాకకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కరోనా మహమ్మారిని కట్టాడు చేసిన గ్రామాలకు ప్రభుత్వం నుండి ప్రోత్సాకాలను అందించనున్నారు. గ్రామంలో కరోనా కట్టడి.. ఆయా గ్రామాల్లోని ప్రజల చేతుల్లోనే ఉండనుంది.

అడిషనల్ చీఫ్ సెక్రెటరీ నవనీత్ సెహగల్ మాట్లాడుతూ కరోనా కట్టడిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలనే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి తీసుకున్నారని తెలిపారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కు ఇందుకు సంబంధించిన సూచనలు వెళ్లాయని అన్నారు. గ్రామాల్లో ప్రజలు కూడా కరోనా కట్టడి చర్యల్లో పాలుపంచుకోవడం కోసం ముఖ్యమంత్రి ‘మేరా గావ్.. కరోనా ముక్త్ గావ్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. ఆయా గ్రామాల్లో కరోనా అన్నదే లేదని గ్రామాలు ప్రకటించాల్సి ఉంటుందని.. అలా ప్రకటించిన గ్రామాలకు ప్రభుత్వం నుండి ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు. గ్రామాలు-ప్రభుత్వం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని తెలిపారు.

గ్రామాల్లో కరోనా ప్రబలకుండా ఉండేందుకు యోగి ఆదిత్యనాథ్ ఇప్పటికే మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. గ్రామాల్లో కరోనా కేసులు నమోదైన వెంటనే మిగిలిన వారందరినీ అప్రమత్తం చేస్తున్నారు. ప్రతి రోజూ రూరల్ ప్రాంతాల్లో రోజూ లక్షకు పైగా టెస్టులను నిర్వహిస్తూ ఉన్నారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ను ఉపయోగించి పెద్ద ఎత్తున టెస్టులను చేస్తున్నారు. సివిల్ సొసైటీ గ్రూపులైన ఆశా, అంగన్వాడీ, ఏఎన్ఎంలతో అధికారులు సమాయత్తమవుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మెడికల్ కిట్స్, ఆక్సీ మీటర్లు, ఇన్ఫ్రా రెడ్ థర్మామీటర్లను పెద్ద ఎత్తున అందుబాటులో ఉండేలా చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారిని క్వారెంటైన్ సెంటర్లకు పంపుతూ ఉన్నారు. మానిటరింగ్ కమిటీలకు చెందిన సభ్యులు 79512 గ్రామాలలో సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. 28,742 గ్రామాల్లో ఇన్ఫెక్షన్లు గుర్తించి ట్రీట్మెంట్ ను అందిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని 68 శాతం గ్రామాల్లో కరోనా అన్నదే లేకుండా చూసుకున్నారు. అందుకు కారణం మోదీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలే అని చెబుతున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × four =

Back to top button