More

    మన దేశానికి అతిపెద్ద సమస్య ఏ పార్టీనో చెప్పిన యోగి ఆదిత్యనాథ్

    కాంగ్రెస్ పార్టీపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మండిపడ్డారు. మన దేశానికి అతిపెద్ద సమస్య కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. అవినీతి, అరాచకాలకు ఆ పార్టీ కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. రాయ్ బరేలీలో బీజేపీ నిర్వహించిన జన విశ్వాస్ యాత్ర సభలో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ దేశానికి “పెద్ద సమస్య” అని మరియు అరాచకానికి, అవినీతికి మూలమని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్, సమాజ్‌వాదీ పార్టీపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ జెండా ఉన్న వాహనం అంటే రాష్ట్ర ప్రజలకు తెలుసు అని అన్నారు. లోపల ఒక గూండా కూర్చుని ఉన్నాడని ప్రతి ఒక్కరికీ తెలుసునని అన్నారు.

    రాయ్‌బరేలీకి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరడం వల్ల రాయ్‌బరేలీ నుంచి కాంగ్రెస్‌ కనుమరుగు అవుతుందని ఆదిత్యనాథ్‌ అన్నారు. దేశానికి కాంగ్రెస్‌ సమస్య. రాయ్‌బరేలీ ఎప్పుడూ విదేశీ పాలనను అంగీకరించలేదు. దేశంలో తీవ్రవాదం, అరాచకత్వం, అవినీతికి మూలకారణం కాంగ్రెస్ అని, కులతత్వం, భాషా భేదాలను వ్యాప్తి చేసేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందని ఆరోపించారు. ఎస్పీ, బహుజన్ సమాజ్ పార్టీలపై విరుచుకుపడిన ఆదిత్యనాథ్, “రాష్ట్రానికి ఎస్పీ, బీఎస్పీలు సమస్య అని అన్నారు. మా ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తుంది మరియు విశ్వాసాన్ని గౌరవిస్తుంది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఇలా చేయగలవా? రాముడు మరియు కృష్ణుడిని ఊహాత్మకంగా అభివర్ణించిన వారు గుడి కట్టగలరా? రామభక్తులపై కాల్పులు జరిపేవారు దేవాలయాలు నిర్మించగలరా” అని ఆయన చెప్పుకొచ్చారు. రాయ్‌బరేలీలో ₹ 834 కోట్ల విలువైన 381 ప్రాజెక్టులకు ఇటీవల యోగి ఆదిత్యనాథ్ ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకటన ద్వారా తెలిపింది.

    Trending Stories

    Related Stories