దుబాయ్‌లో ఉన్న భారతీయ యోగా టీచర్ .. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 29 నిమిషాల పాటు ఆ టీచర్ వృశ్చికాసనం వేశాడు. యశ్ మన్సూక్‌భాయ్ మొరాదియా వేసిన ఆ ఆసనం వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తేలు ఆకారంలో 21 ఏళ్ల మన్సూక్ వేసిన యోగా అందర్నీ అట్రాక్ట్ చేస్తోంది. గతంలో ఈ ఆసనాన్ని 4 నిమిషాల 47 సెకన్ల పాటు వేశాడు. ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ వీడియోను పోస్టు చేసింది. వృశ్చికాసనం అడ్వాన్సడ్ యోగా క్యాటగిరీలోకి వస్తుంది. 2001లో పుట్టిన మన్సూక్ 8 ఏళ్ల వయసులో యోగా జర్నీ స్టార్ట్ చేశాడు. 2010 నుంచి అతను పవర్ యోగా చేస్తున్నాడు.