More

    సౌదీ అరేబియా క్రీడంశాలలో యోగా కూడా ఒక భాగమే

    అతి త్వరలో సౌదీ అరేబియా పాఠశాలల్లో స్పోర్ట్స్ పాఠ్యాంశాల్లో యోగా కూడా భాగం కానుంది. సౌదీ అరేబియా తన పాఠ్యాంశాల్లో కొన్ని యోగా వ్యాయామాలను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ యోగా అభ్యాసాలలో ప్రధానంగా భంగిమ-ఆధారిత శారీరక దృఢత్వం, ఒత్తిడి నుండి ఉపశమనం.. లాంటి ఎన్నో అంశాలను తీసుకుని రానున్నారు. సౌదీ యోగా కమిటీ (SYC) ప్రెసిడెంట్ నౌఫ్ అల్-మర్వాయి 14 మార్చి 2022న ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటనలో, శారీరక మానసిక దృఢత్వానికి యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. నవంబర్ 2017లో, సౌదీ అరేబియా వాణిజ్య మంత్రిత్వ శాఖ యోగాను ఒక క్రీడగా బోధించడం, అభ్యాసం చేయడాన్ని ఆమోదించడం గమనించదగ్గ విషయం.

    9 మార్చి 2022న, SYC పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల కోసం ఒక ఉపన్యాసాన్ని నిర్వహించింది. ఇది ప్రాథమికంగా పరిచయ సెషన్, దీనిలో SYC, సౌదీ స్కూల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ మధ్య మంచి సమన్వయం ఏర్పడింది. దీంతో సౌదీ పాఠశాలల్లో యోగాకు మార్గం మరింత సుగమం అయింది. విద్యా మంత్రిత్వ శాఖ, SYC కలిసి క్రీడలలో పాల్గొనే విద్యార్థుల స్థాయిలను పెంచడం, వివిధ అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలలో సౌదీ అరేబియా ప్రాతినిధ్యాన్ని పెంచడం, సౌదీ యువత ఆరోగ్యాన్ని పెంపొందించే దిశగా అడుగులు వేయించాలని భావిస్తున్నాయి.

    అరబ్ న్యూస్ నివేదిక ప్రకారం, సర్టిఫైడ్ యోగా శిక్షకుడు, ఆనంద యోగా స్టూడియో వ్యవస్థాపకుడు ఖలీద్ జమాన్ అల్-జహ్రానీ మాట్లాడుతూ “నేను యోగాను లోతుగా తెలుసుకోవాలని అనుకున్నాక అందులో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను కనుగొన్నాను. ” అని అన్నారు. విద్యార్థుల అభివృద్ధికి దోహదపడేలా, సౌదీ విద్యా వ్యవస్థకు యోగాను పరిచయం చేయడం ఒక సమర్థవంతమైన చర్య నేను నమ్ముతున్నానని అన్నారు. అల్-జహ్రానీ మాట్లాడుతూ పాఠశాలల్లో యోగా కారణంగా పిల్లలకు, వారి కుటుంబాలకు మాత్రమే కాకుండా మొత్తం సమాజానికి ప్రయోజనం చేకూర్చే విద్యా సంస్కరణ అవుతుందని అన్నారు. సాంకేతిక పురోగతులు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో నిండిన రోజువారీ జీవితంలో యోగాను భాగం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

    SYC తన పరిధిని, లక్ష్యాలను విస్తరించాలని యోచిస్తోందని నౌఫ్ అల్-మర్వాయి తెలియజేశారు. సౌదీలోని అనేక ప్రాంతాల్లో పాఠశాలల్లో యోగా బోధనను పెద్ద ఎత్తున అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు. ఆమె యోగా నేర్పిన మొదటి సౌదీ మహిళగా ప్రసిద్ధి చెందారు. యోగాకు విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదం పొందేలా ఆమె ముఖ్యమైన పాత్ర పోషించింది. నౌఫ్ అల్-మర్వాయ్‌ను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ అవార్డుతో సత్కరించారు.

    Trending Stories

    Related Stories