తాము నెహ్రూ-గాంధీ కుటుంబానికి బానిసలమని, చివరి శ్వాస వరకు వారికి బానిసలుగా ఉంటామని సిరోహి ఎమ్మెల్యే సన్యామ్ లోధా రాజస్థాన్ అసెంబ్లీలో సగర్వంగా ప్రకటించారు. రాజస్థాన్ అసెంబ్లీలో జరుగుతున్న బడ్జెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సలహాదారుగా పనిచేస్తున్న లోధా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. హరిదేవ్ జోషి యూనివర్శిటీ ఆఫ్ జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ సవరణ బిల్లుపై మాట్లాడుతూ, “అవును మేము నెహ్రూ-గాంధీ కుటుంబానికి బానిసలం, మా చివరి శ్వాస వరకు మేము వారికి బానిసలుగా ఉంటాము” అని లోధా అన్నారు. ఆయన ఇంకాస్త ప్రేమను గాంధీ కుటుంబంపై చూపిస్తూ.. దేశాన్ని నెహ్రూ-గాంధీ కుటుంబం నిర్మించిందని, కాబట్టి తాము బానిసలుగా మిగిలిపోతామని ఆయన అన్నారు.
ఆయన చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్ష బెంచ్‌ల నుండి తీవ్ర విమర్శలకు దారితీసింది. బీజేపీ నేత రాజేంద్ర రాథోడ్ మాట్లాడుతూ.. ఇది కొత్త సంస్కృతి. బానిసత్వం కోసం మీకు అభినందనలు. సమాజానికి ఏం సందేశం పంపుతారని ప్రశ్నించారు. సాధారణంగా బానిసలు తమ మనసులోని మాటను చెప్పలేరు, కానీ దానిని స్వయంగా అంగీకరించారని విమర్శించారు రాథోడ్. ప్రభుత్వం, ప్రతిపక్ష బెంచ్‌ల మధ్య వాగ్వాదం అసెంబ్లీలో గందరగోళానికి దారితీసింది. ఇరువర్గాలు నినాదాలు చేయడంతో స్పీకర్ జోక్యం చేసుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించేందుకు ప్రయత్నించారు.
కాంగ్రెస్ పార్టీ వరుస ఓటముల కారణంగా ఎంతగానో కృంగి పోతూ ఉండగా.. ఇలా కొంతమంది చివరి వరకు కట్టు బానిసలు లాగే ఉంటామని కామెంట్లు చేయడం ఏంటో..? 2014 తర్వాత ఆ పార్టీ పూర్తిగా పతనావస్థకు చేరింది. నెహ్రూ (గాంధీ) కుటుంబానికి చెందిన నాలుగో తరం కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత ఆ పార్టీ ఏ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ నేతగా రాహుల్ గాంధీని విఫలమవుతూనే ఉన్నారు.