రానున్న నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణలో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. భారత వాతావరణ శాఖ-హైదరాబాద్ సూచన ప్రకారం, రాబోయే నాలుగు రోజులు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉపరితల ద్రోణి, ఆవర్తనం ప్రభావంతో నగరంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నగరంలో గరిష్టంగా 39.2 డిగ్రీలు, కనిష్టంగా 29.4 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదివారం హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 39.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. రాబోయే 48 గంటలపాటు, నగరంలోని కొన్ని ప్రాంతాలలో పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైన ప్రాంతాలు
ఆదిలాబాద్ – 42.3
నిజామాబాద్ – 42.7
రామగుండం – 40.4
హైదరాబాద్ – 39.2
భద్రాచలం – 38.6