రెండు గంటలుగా యశోద ఆసుపత్రిలో కేసీఆర్.. ఆయన ఆరోగ్యంపై అప్డేట్

0
962

స్వల్ప అస్వస్థతతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చేరారు. రెండు రోజులుగా కేసీఆర్ నీరసంగా ఉన్నారు. అంతేకాదు ఎడమ చేయి, ఎడమ కాలు కూడా లాగుతుండటంతో ఆయన ఆసుపత్రికి వచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ కు వైద్యులు యాంజియోగ్రామ్ చేశారు. ఆసుప‌త్రి వ‌ద్ద పెద్ద ఎత్తున పోలీసులను మోహ‌రించారు. కేసీఆర్ ను చూసేందుకు చాలా మంది త‌ర‌లివ‌చ్చే అవ‌కాశం ఉండ‌డంతో ఆసుప‌త్రి ప్రాంగ‌ణంలో భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. కేసీఆర్‌ రెండు గంట‌లుగా ఆయ‌న ఆసుప‌త్రిలోనే ఉన్నారు. కేసీఆర్ కుటుంబ స‌భ్యులు అంద‌రూ ఆసుప‌త్రికి చేరుకున్నారు. వైద్య ప‌రీక్ష‌ల అనంత‌రం కేసీఆర్ కు వైద్యులు ప‌లు సూచ‌న‌లు చేశారు. ఆయ‌న ఆరోగ్యంపై ఆసుప‌త్రి మీడియాకు ప్ర‌క‌ట‌న చేయ‌నుంది.

యాంజియోగ్రామ్ టెస్టు రిపోర్ట్ నార్మల్ గా ఉందని పరీక్షల అనంతరం వైద్యులు వెల్లడించారు. రక్త నాళాల్లో ఎలాంటి బ్లాక్స్ లేవని వైద్యులు తెలిపారు. రెండు రోజులుగా నీరసంగా ఉందని సీఎం చెప్పారని, దీంతో అన్ని నార్మల్ పరీక్షలు చేశామని వెల్లడించారు. సీటీ స్కాన్ తో పాటు మరికొన్ని పరీక్షలను నిర్వహించామని చెప్పారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఆయనకు ప్రతి ఏటా ఫిబ్రవరిలో సాధారణ చెకప్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు సాధారణ పరీక్షలతో పాటు ప్రివెంటివ్ చెకప్ కింద మరికొన్ని పరీక్షలను నిర్వహించామని తెలిపారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ షెడ్యూల్ ప్ర‌కారం ఈ రోజు యాదాద్రిలో పర్యటించాల‌ని అనుకున్నారు. అయితే ఆయ‌న ప‌ర్య‌ట‌న ర‌ద్ద‌యింద‌ని సీఎంవో వర్గాలు తెలిపాయి. దీంతో నేడు జ‌ర‌గాల్సిన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి తిరుకల్యాణ మహోత్సవానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజ‌రుకానున్నారు. తెలంగాణ‌ ప్రభుత్వం తరఫున ఆయ‌న‌ పట్టువస్త్రాలు సమర్పిస్తారు.