ఆదిలాబాద్: జిల్లాలో గొర్రెల లబ్ధిదారులకు ప్రభుత్వం నగదు బదిలీ చేయాలని యాదవ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గొర్ల రాజు యాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని యాదవ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో ప్రభుత్వం గొర్ల లబ్ధిదారులకు నగదు బదిలీ చేస్తూ జీవో విడుదల చేయడం హర్షణీయమన్నారు. అయితే వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాలోని లబ్ధిదారులకు కూడా వెంటనే నగదు బదిలీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 18 ఏళ్లు నిండిన లబ్ధిదారులను పథకంలో చేర్చి అర్హులుగా గుర్తించి రెండవ విడత పంపిణీ చేయాలన్నారు. వారం రోజులలోగా ఆదిలాబాద్ జిల్లాలో నగదు బదిలీ జీవో విడుదల చేయాలని, లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు రఘువీర్ యాదవ్, పలువురు నాయకులు పాల్గొన్నారు.