National

తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై ప్లస్ సెక్యూరిటీ

ఏక‌నాథ్‌ షిండే క్యాంపులోని ఎమ్మెల్యేల కార్యాలయాలు, ఆస్తులను శివసేన కార్యకర్తలు ధ్వంసం చేయబోతున్నారనే వార్తల నేపథ్యంలో కేంద్రం ఆదివారం నాడు 15 మంది శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వై ప్లస్ కేట‌గిరీ భద్రతను కల్పించింది. ‘వై’ కేటగిరీ భద్రతలో ఎనిమిది మంది సిబ్బంది సెక్యూరిటీగా ఉంటారు. దాదర్ ఎమ్మెల్యే సదా సర్వాంకర్ గౌహతిలోని ఏక్‌నాథ్ షిండే, ఇతర తిరుగుబాటు శివసేన ఎమ్మెల్యేల క్యాంపులో చేరిన నేప‌థ్యంలో.. ఆయ‌న‌ నివాసం వద్ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) మోహరించింది. థానే, డోంబివిలి, కళ్యాణ్‌, ఉల్హాస్‌నగర్‌లోని షిండే క్యాంపు కార్యాలయాలకు పోలీసు భద్రత కల్పించారు. Y+ భద్రతను.. రమేష్ బోర్నారే, మంగేష్ కుడాల్కర్, సంజయ్ శిర్సత్, లతాబాయి సోనావానే, ప్రకాస్ సర్వే, సదానంద్ శరణవంకర్, యోగేష్ దాదా కదమ్, ప్రతాప్ సర్నాయక్, యామినీ జాదవ్, ప్రదీప్ జైస్వాల్, సంజయ్ రాథోడ్, దాదాజీ భూసే, దిలీప్ లాండే, బాలాజీ కళ్యాణర్, సందీపన్ భూమారే ల‌కు కేటాయించారు. కేంద్రం భద్రత కల్పించిన ఈ ఎమ్మెల్యేల జాబితాలో తిరుగుబాటు ముఖ్య‌నేత ఏక్‌నాథ్ షిండే లేరు.

Related Articles

Back to top button