ఎన్నాళ్లకెన్నాళ్లకు..! మూడేళ్ల తర్వాత విదేశీ పర్యటనకు..!!

0
767

కరోనా వైరస్ ను పుట్టించి ప్రపంచానికి పాకించి వేడుక చూసిన చైనా అంటేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు హడలిలెత్తిపోతున్నాయి. కరోనాతో లక్షల మంది చనిపోయారు. ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారు. ఈ వైరస్ చైనాలో వెలుగుచూసినప్పటి నుంచి ఆ దేశ అధ్యక్షుడు షీ జిన్ పెంగ్ మరో దేశానికి వెళ్లలేదు.

వైరస్ వ్యాప్తి కారక దేశం అన్న అపనింద ఓ వైపు.. ఆయన ఆరోగ్యం సరిగా లేక అసలు దేశం దాటలేకపోయారు. దాడాపు 3 ఏళ్లుగా చైనా అధ్యక్షుడు షీజిన్ పింగ్ విదేశీ పర్యటనలు పెట్టుకోలేదు. తొలిసారి ఇన్నాళ్ల తర్వాత ఆయన చైనా దాటి బయటకు వస్తున్నారు. తాజాగా స్వతంత్ర ప్రాంతం హాంగ్ కాంగ్ లో చైనా అధ్యక్షుడు పర్యటించనున్నారు. హాంగ్ కాంగ్ 25 వార్షికోత్సవ వేడుకల్లో జిన్ పింగ్ స్వయంగా పాల్గొననున్నారు. ఈ విషయాన్ని చైనా అధికారిక మీడియా స్వయంగా తెలిపింది.

హాంగ్ కాంగ్ లో పలు కార్యక్రమాల్లో జిన్ పింగ్ పాల్గొననున్నారు. అసలు చైనాతో స్నేహం హాంగ్ కాంగ్ వాసులకు గిట్టడం లేదు. తమ ప్రాంతంలో చైనా వేలు పెట్టి ఆ దేశంలో కలుపుకోవాలనుకోవడాన్ని హాంగ్ కాంగ్ వాసులు వ్యతిరేకిస్తున్నారు. హాంగ్ కాంగ్ తమ ప్రాంతంలోనేదేనని చైనా వాదిస్తూ అక్కడ సైన్యాన్ని మోహరించి అణిచివేస్తోంది. ఈ క్రమంలోనే హాంగ్ కాంగ్ పై పట్టు కోసం చైనా ప్రయత్నిస్తోంది. అయితే జూలై1 తేదీ నుంచి హాంగ్ కాంగ్ కొత్త నాయకుడిగా జాన్ లీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో జిన్ పింగ్ పాల్గొంటారని అక్కడి వార్త సంస్థ తెలిపింది. మరోపక్క హాంగ్‌కాంగ్‌ సీనియర్‌ అధికారులు కొవిడ్‌ బారిన పడ్డారు. దీంతో జిన్‌పింగ్‌ పర్యటన కొనసాగుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హాంగ్ కాంగ్ 25వ స్వాధీన దినోత్సవ వేడుకలు కావడంతో దీనికి చాలా ప్రాధాన్యం సంతరించుకుంది. 2019లో ఇక్క చెలరేగిన ప్రజాస్వామ్య మద్దతు ఉద్యమాన్ని అణచివేసి ఎన్నికలు సంస్కరణలు తీసుకొచ్చిన తర్వాత తొలిసారి ఏర్పడ్డ ప్రభుత్వ ప్రమాణ వేడుక కూడా ఉండడంతో మరింత ప్రతిష్టాత్మకంగా మారింది.

అయితే గతేడాది చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ టిబెట్ లో ప్రత్యక్షం కావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. హఠాత్తుగా ఆ దేశంలో పర్యటించడంతో పలు ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. వెయ్యేళ్ల తర్వాత భారీ స్థాయిలో చైనాలో వరదలు వచ్చాయి. ఈ క్రమంలో జిన్ పింగ్ టిబెట్ పర్యటనకు వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. లాసాలోని బార్ ఖోర్ ప్రాంతంలో జిన్ పింగ్ ప్రసంగిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. టిబెటన్ల బౌద్ధ గురువు దలైలామా వింటర్ రెసిడెన్స్ వద్ద ఆయన మాట్లాడారు. టిబెట్ కి శాంతియుత విముక్తిని ప్రసాదించే కట్టడంగా ఆయన అభివర్ణించారు. వివిక్షకు గురయ్యే ఏ ఒక్క జాతిని ఆధునిక సోషలిస్టు చైనా ఆవిర్భావంలో విస్మరించే ప్రసక్తే లేదని, అన్ని జాతులను కలుపుకుని వెళుతామన్నారు.

ఎయిర్ పోర్టులో దిగేంత వరకు ఆయన పర్యటనపై ఎలాంటి వివరాలు తెలియరాలేదు. అయితే ఆయన పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకోవడానికి వెళ్లాడని సీసీటీవీ వెల్లడించింది. రెండుసార్లు టిబెట్ ను జిన్ పింగ్ సందర్శించారు. జిన్ పింగ్ పర్యటనకు ముందు లాసాలో భద్రతను కట్టుదిట్టం చేశారు. పలు ఆంక్షలు, నిబంధనలు విధించారు. టిబెట్ పై తమదే ఆధిపత్యమని ఎప్పటి నుంచో చైనా అంటోంది. దీనిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఐరాసాలో దీనిని ఖండించింది. ఆ తర్వాత చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ టిబెట్ పర్యటనపై భారత ప్రభుత్వం దృష్టి సారించింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

nineteen + seventeen =