International

భారత్ బోర్డర్ కు అతి దగ్గరగా ‘జిన్ పింగ్’

చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్‌ భారత్ స‌రిహ‌ద్దుల్లో పర్యటించారు. అరుణాచ‌ల్ ప్ర‌దేశ్ బోర్డ‌ర్ స‌మీపంలో ఉన్న ఓ గ్రామంలో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్ ప‌ర్య‌టించారు. టిబెట్ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ఆయ‌న సరిహద్దు ప్ర‌దేశాల‌ను పరిశీలించారు. అరుణాల్‌ ప్రదేశ్ సరిహద్దుకు 20 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న టిబెట్ ప్రాంతంలో జిన్‌పింగ్ విమానం ల్యాండ్ అయ్యింది. టిబెట్ రాజ‌ధాని లాసా ప‌ర్య‌ట‌న‌కు ముందు.. ఆయ‌న య‌ర్లుంగ్ జాంగ్బో(బ్ర‌హ్మ‌పుత్ర‌) న‌ది వ‌ద్దకు వెళ్లి బ్రిడ్జ్ ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. సిచువాన్‌-టిబెట్ రైల్వే ప్రాజెక్టు ప‌నుల‌ను కూడా ప‌రిశీలించేందుకు ఆయ‌న నింగ్చి రైల్వే స్టేష‌న్‌కు వెళ్లారు. అక్క‌డ నుంచి ఆయ‌న లాసాకు రైళ్లో వెళ్లారు.

గత మూడు దశాబ్దాల్లో చైనా అధ్యక్షుడు టిబెట్‌లో పర్యటించడం ఇదే ప్రథమం. చైనా జాతీయ మీడియా సీసీటీవీ శుక్రవారం విడుదల చేసిన ఫుటేజీలో విమానం నుంచి దిగిన జిన్‌పింగ్‌కు సంప్రదాయ స్వాగతం పలికిన దృశ్యాలు ఉన్నాయి. బుధవారం టిబెట్ ఆగ్నేయంలోని నియింగ్చి మెయిన్లింగ్ విమానాశ్రయానికి చేరుకున్నప్పటికీ, రెండు రోజుల వరకు కూడా జిన్‌పింగ్‌ పర్యటన గురించి అధికారిక మీడియాలో ప్రస్తావించలేదు. జిన్‌పింగ్‌ గతంలో రెండుసార్లు టిబెట్‌లో పర్యటించారు. 1998 లో ఒకసారి ఫుజియాన్ ప్రావిన్స్ పార్టీ చీఫ్‌గా, 2011 లో మరోసారి ఉపాధ్యక్షునిగా ఉన్న సమయంలో టిబెట్‌లో పర్యటించారు. అధ్యక్ష హోదాలో టిబెట్‌లో పర్యటించడం మాత్రం ఇదే ప్రథమం. టిబెట్‌ను సందర్శించిన చివరి చైనా అధ్యక్షుడు జియాంగ్‌ జెమిన్‌. 1990 లో జియాంగ్ టిబెట్‌లో పర్యటించారు. టిబెటన్లు చైనా ప్రభుత్వం అణచివేస్తూ.. వారి సంస్కృతిని నాశనం చేస్తోంది.

Xi Jinping Makes Rare Visit To Tibet First Time As President - Sakshi

‘రేడియో ఫ్రీ ఆసియా’ మీడియా సంస్థ జిన్ పింగ్ రాకకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కొందరు ఉత్సాహభరితమైన వ్యక్తులతో నిండిన చోట జిన్ పింగ్ నడుస్తున్న వీడియోను ప్రచురించింది. మినీ బస్సు యొక్క ఓపెన్ విండో నుండి చేతులు ఊపుతూ కనిపించాడు. టిబెట్‌లోని అన్ని ప్రాంతాలు, అన్ని జాతుల ప్రజలు భవిష్యత్తులో సంతోషకరమైన జీవితం వైపు వెళతారని ఆ వీడియోలో చెప్పారు.

టిటెబ్ 13వ శతాబ్దం మధ్య కాలం నుంచీ తమ దేశంలో భాగంగా ఉందని చైనా చెప్పుకుంటూ ఉంది. టిబెటన్లు మాత్రం తమ దేశం ఎన్నో శతాబ్దాల పాటు స్వతంత్ర రాజ్యంగా ఉందని చెబుతున్నారు. 1951లో చైనా సైన్యం టిబెట్‌ను అధీనంలోకి తెచ్చుకుంది. టిబెట్‌ ప్రతినిధి బృందంతో ఒక ఒప్పందం చేసుకుంది. దాని ప్రకారం టిబెట్ సౌర్వభౌమాధికారాన్ని చైనాకు అప్పగించారు. ఇందుకు చాలా మంది టిబెటన్లు ఒప్పుకోలేదు. చైనా నియంతృత్వాన్ని ఒప్పుకోని వారిపై చైనా ఉక్కుపాదం మోపుతోంది. ఎంతో మందికి కఠిన శిక్షలు వేయడమే కాకుండా.. కొన్ని వేల మందిని చైనా ప్రభుత్వం చంపేసింది.

Xi Jinping to lead Tibet 70th anniversary celebrations | South China  Morning Post

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three − two =

Back to top button