International

వుహాన్ ల్యాబ్ లో వైరస్ పుట్టిందనడానికి సంచలన సాక్ష్యాలను బయటపెట్టిన అమెరికా ఇంటెలిజెన్స్

చైనా లోని వుహాన్ ల్యాబ్ లోనే కరోనా వైరస్ ను తయారు చేశారని ఇప్పటికే ఎంతో మంది శాస్త్రవేత్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వుహాన్ లోని వైరాలజీ ఇన్స్టిట్యూట్ లోనే ఈ వైరస్ ను తయారు చేశారని అమెరికా కూడా బలంగా నమ్ముతూ ఉంది. తాజాగా అమెరికా ఇంటెలిజెన్స్ ఓ సంచలన రిపోర్టును బయట పెట్టింది. వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి చెందిన ఎంతో మంది రీసెర్చర్లు కరోనా లక్షణాలతో నవంబర్ 2019లో ఆసుపత్రుల పాలయ్యారట..! కరోనా మహమ్మారిని కనిపెట్టిందే చైనా అంటూ చెబుతూ ఉండగా.. చైనా ప్రభుత్వం మాత్రం ఒప్పుకోవడం లేదు. జంతువుల మార్కెట్ నుండి చైనా ప్రజల్లోకి వచ్చిందని చెప్పుకుంటూ ఉంది. అయితే ల్యాబ్ లో పని చేస్తున్న వాళ్లు మొదటగా కరోనా బారిన పడ్డారనే విషయం ఇప్పుడు బయటకు రావడంతో తప్పకుండా చైనా ల్యాబ్ లోనే వైరస్ తయారైందని ప్రతి ఒక్కరూ బలంగా నమ్మడం ఖాయం.

ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడే ఆయన అడ్మినిస్ట్రేషన్ 2019లో వుహాన్ ల్యాబ్ లో పని చేసే కొందరు కరోనా బారిన పడ్డారని తెలిపారు.. అయితే ఆసుపత్రి పాలైన విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ రిపోర్టులు బయటకు రావడం.. రీసర్చ్ చేస్తున్న వాళ్లు ఆసుపత్రి పాలయ్యారని చెప్పడం వంటివి చూస్తుంటే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు నిజమేనని అనిపిస్తోంది. చైనా తన మీద వస్తున్న నిందలను ఎప్పటికప్పుడు తప్పుబడుతూ వస్తోంది. సాధారణ ప్రజలలో కరోనా సోకి ఆసుపత్రి పాలైన మొదటి రిపోర్టు డిసెంబర్ 8, 2019న వుహాన్ లో నమోదయ్యింది. అంతకు ముందే కరోనా లక్షణాలతో వుహాన్ ల్యాబ్ లో పని చేసే శాస్త్రవేత్తలు బయటకు వచ్చారన్నమాట..!

Related Articles

Leave a Reply

Your email address will not be published.

19 − eight =

Back to top button