More

    ఆర్.ఎస్.ఎస్. రక్తదాన శిబిరాన్ని కూడా నిర్వహించనివ్వలేదు.. కారణం ఏమి చెప్పారంటే

    ఏ సహాయ కార్యక్రమాలకైనా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఖ్(ఆర్.ఎస్.ఎస్.) ముందుంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలు రాష్ట్రాల్లో ఆర్.ఎస్.ఎస్. రక్తదాన శిబిరాలను కూడా నిర్వహిస్తూ ఉంది. ఆపదలో ఉన్న వాళ్ళను ఎన్నో సార్లు ఆదుకుంది. ఆర్.ఎస్.ఎస్. నిర్వహించాలని అనుకున్న రక్తదాన శిబిరాన్ని పంజాబ్ రాష్ట్రంలో అడ్డుకున్నారు. ఆర్.ఎస్.ఎస్., బీజేపీకి చెందిన వాలంటీర్లు పంజాబ్ లోని రోపర్ జిల్లాలో ఉన్న నూర్పుర్ బేడి గ్రామంలో బ్లడ్ డొనేషన్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో రక్తం కొరత ఉండడంతో కొంతైనా తమ బ్లడ్ డొనేషన్ క్యాంపు అక్కడి వారికి సహాయపడుతుందని భావించారు. కానీ నిర్వాహకులు అనుకున్నట్లుగా అక్కడి పరిస్థితులు కనిపించలేదు.

    Farmers' clash with RSS workers averted at Ropar

    రైతులమని చెప్పుకుంటూ అక్కడికి వచ్చిన కొందరు బ్లడ్ డొనేషన్ క్యాంపును నిలిపివేయాలని కోరారు. కొద్ది క్షణాల్లో భీతావహ వాతావరణాన్ని సృష్టించారు. అక్కడ ఉంచిన చైర్లను విసిరేశారు. భారతీయ జనతా పార్టీకి, ఆర్.ఎస్.ఎస్. కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ బిల్లులను రద్దు చేసే వరకూ బీజేపీని, ఆర్.ఎస్.ఎస్. ను ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించనివ్వమని తేల్చి చెప్పారు. రక్తదాన శిబిరంతో ప్రజలకు మంచి జరుగుతుందని వాలంటీర్లు చెబుతున్నా కూడా వినకుండా శిబిరంపై దాడి చేశారు. దీంతో నిర్వాహకులు పోలీసులకు పిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. డి.ఎస్.పి. ఆనంద పూర్ సాహిబ్ రామిందర్ సింగ్ అక్కడికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు.

    Barricade broke, farmers entered RSS blood donation camp, pushed by police,  threw chairs in the field | बैरिकेड तोड़ आरएसएस के रक्तदान कैंप में घुसे  किसान, पुलिस से धक्का-मुक्की ...

    క్యాంపు రద్దు:
    ఈ ఆందోళనలను చూసి బ్లడ్ డొనేషన్ క్యాంపును రద్దు చేశారు. క్యాంపును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించగానే కొందరు అక్కడే సంబరాలు చేసుకున్నారు. ఆ తర్వాత వాలంటీర్లపై బెదిరింపులకు కూడా దిగారు. ఆర్.ఎస్.ఎస్., బీజేపీ అనుచరులకు చెందిన షాపుల్లో ఎటువంటి వస్తువులు కూడా కొనమని తేల్చి చెప్పారు. ఆనందపూర్ సాహిబ్ లో మే 22న, రూప్ నగర్ లో మే 23న బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించాలని ఆర్.ఎస్.ఎస్., బీజేపీ భావించాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అక్కడ నిర్వహిస్తారో లేదో తెలియాల్సి ఉంది.

    Farmers Protest Against Rss Blood Donation Camp In Ropar Of Punjab - पंजाब:  रोपड़ में आरएसएस के रक्तदान कैंप के विरोध में भड़के किसान, तनातनी के बाद  शिविर रद्द - Amar Ujala

    కొన్ని నెలలుగా పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే..! దేశం మొత్తం కరోనాతో యుద్ధం చేస్తూ ఉంటే.. మరో వైపు రైతులు నిరసన కార్యక్రమాలకు స్వస్తి చెప్పడం లేదు. నిరసన కార్యక్రమాలు చేస్తున్న ప్రాంతాలు కరోనాకు నిలయంగా మారాయి. నిరసనల్లో పాల్గొంటున్న వారు ఇతర ప్రాంతాలకు వెళుతూ ఉండడం.. ఆ ప్రాంతాల్లో కూడా కరోనా ఉధృతమవ్వడానికి కారణమవుతూ ఉంది.

    Trending Stories

    Related Stories