అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్తగూడెం బ్రిడ్జి వద్ద జరిగిన జంట హత్యల విషయంలో పోలీసులు సంచలన విషయాలను కనుగొన్నారు. క్యాబ్ డ్రైవర్ యశ్వంత్ తో తన భార్య జ్యోతికి వివాహేతర సంబంధం ఉన్న విషయాన్ని గుర్తించిన శ్రీనివాస్ ఇద్దరిని ఒకేసారి చంపాలని ప్లాన్ చేసుకొన్నాడు.
భర్త ఇంట్లో లేని సమయంలో యశ్వంత్ తో ఇంట్లోనే జ్యోతి ఏకాంతంగా గడిపింది. ఈ విషయాన్ని శ్రీనివాస్ గుర్తించాడు. ఇంట్లోనే వీరిద్దరిని హత్య చేయాలని కూడా మూడు సార్లు శ్రీనివాస్ ప్రయత్నించాడు. కానీ సాధ్యం కాలేదు. అయితే ప్రియుడు యశ్వంత్ , జ్యోతిని హత్య చేయాలని ప్లాన్ చేసిన శ్రీనివాస్ పిల్లలను విజయవాడకు పంపారు. మే 1వ తేదీన కొత్తగూడ బ్రిడ్జి వద్ద ఏకాంతంగా ఉన్న యశ్వంత్, జ్యోతిలను హత్య చేశాడు శ్రీనివాప్,
జవహర్ నగర్ కు చెందిన జ్యోతికి విజయవాడకు చెందిన శ్రీనివాస్ కు 16 ఏళ్ల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు పిల్లలు. స్టీల్ దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు శ్రీనివాస్. యశ్వంత్ తో సంబంధం విషయమై జ్యోతిని భర్త శ్రీనివాస్ పలుమార్లు మందలించాడు. అయితే ఆమె ఈ విషయమై పెద్దగా పట్టించుకోలేదు. యశ్వంత్ తో సంబంధం కొనసాగించింది. ఈ ఇద్దరిని ఒకేసారి హత్య చేయాలని శ్రీనివాస్ భావించాడు. ఈ నెల 1వ తేదీన తాను స్నేహితుల ఇంటికి వెళ్తున్నానని శ్రీనివాస్ జ్యోతికి చెప్పారు. ఈ సమాచారాన్ని యశ్వంత్ కు జ్యోతి చేరవేసింది. దీంతో ఈ నెల 1వ తేదీన కొత్తగూడ బ్రిడ్జి సమీపంలో ఏకాంతంగా గడపాలని భావించారు. వీరిద్దరూ బైక్ పై వెళ్తున్న యశ్వంత్, జ్యోతిలను శ్రీనివాస్ వెంబడించాడు. వీరిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో వారిపై దాడి చేశాడు. వీరిద్దరిని హత్య చేసిన తర్వాత శ్రీనివాస్ విజయవాడకు వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు. విజయవాడలో ఉన్న శ్రీనివాస్ ను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
యశ్వంత్ తో జ్యోతి వివాహేతర సంబంధం కట్ చేయాలంటే విజయవాడకు సిప్ట్ కావాలని కూడా శ్రీనివాస్ భావించాడు. ఈ విషయాన్ని జ్యోతికి కూడా శ్రీనివాస్ చెప్పారని సమాచారం. మరో వైపు తనకు ప్రియుడు యశ్వంత్ తో పాటు భర్త కూడా కావాలని జ్యోతి చెప్పినట్టుగా సమాచారం. ఈ ప్రతిపాదన విన్న శ్రీనివాస్ షాక్ కు గురయ్యారని తెలుస్తోంది. యశ్వంత్, జ్యోతిలను చంపాలని అవకాశం కోసం చూస్తున్న శ్రీనివాస్ మే 1వ తేదీన అవకాశం రాగానే హత్య చేశారని పోలీసులు గుర్తించారు. శ్రీనివాస్ చెప్పిన విషయాలను పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.
ఈ నెల 3వ తేదీన జ్యోతి, యశ్వంత్ మృతదేహాల విషయం ఓ గీత కార్మికుడు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో మృతులు వారాసీగూడకు చెందిన జ్యోతి, యశ్వంత్ లుగా పోలీసులు గుర్తించారు. ఏడాది నుండి యశ్వంత్ తో జ్యోతి వివాహతేర సంబంధం కొనసాగిస్తుందని పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు.