లూడోలో పరిచయమైన వ్యక్తిని కలవడానికి పాకిస్తాన్ కు వెళ్లాలనుకున్న వివాహిత

0
911

లూడోలో పరిచయమైన ఓ వ్యక్తిని కలవడానికి రాజస్థాన్‌కు చెందిన 25 ఏళ్ల వివాహిత పాకిస్థాన్‌కు వెళ్లాలని అనుకుంది. అటారి-వాఘా సరిహద్దును దాటడానికి అమృత్‌సర్ చేరుకుంది. అయితే ఆమె వద్ద ఎటువంటి వీసా పత్రాలు లేవు, దాంతో పాటు ఆమె కలుసుకోవాల్సిన పాక్ కు చెందిన వ్యక్తి కి సంబంధించి ఎటువంటి ఆధారాలు లేవు. దీంతో ఆమెను బి-డివిజన్ పోలీసులు పట్టుకున్నారు. రాజస్థాన్‌లో ఉన్న ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఆ మహిళ కొన్ని నగలు, నగదును తీసుకువెళుతుందని, ఆమె కుటుంబ సభ్యులు ఒకరోజులో ఇక్కడికి చేరుకుంటారని పోలీసు ఇంచార్జి అమర్‌జిత్ సింగ్ తెలిపారు.

ఆమె మహారాజ్‌గంజ్ ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తోంది. ఆన్ లైన్ లూడోలో ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. అయితే అతడు పాక్ కు చెందిన వ్యక్తి దీంతో ఎలాగైనా పాక్ లోకి అడుగుపెట్టాలని బోర్డర్ లోకి వచ్చింది. కానీ పోలీసులకు దొరికిపోయింది. పోలీసులు మాట్లాడుతూ ఆమెను విచారించగా.. ఆమె మాకు రాజస్థాన్‌లోని తన తల్లి నంబర్‌ను ఇచ్చింది. ఆమె నుండి స్వాధీనం చేసుకున్న వాటిలో ఏది అభ్యంతరకరమైన వస్తువు దొరకలేదు. కానీ ఆమె మానసికంగా డిస్టర్బ్ అయినట్లు కనిపిస్తోంది. ఇంటి దగ్గర ఏమైనా జరిగి ఉండవచ్చు అని పోలీసులు భావించారు.

రెండున్నరేళ్ల కుమారుడి తల్లి అయిన ఆ మహిళ కొద్దిరోజుల క్రితం ఆన్‌లైన్ లూడో గేమ్‌లో పాక్ వ్యక్తిని కలుసుకుంది. తర్వాత ఫేస్‌బుక్, వాట్సాప్‌లో కనెక్ట్ అయ్యింది. అతడు ఆమెను పాక్ కు రమ్మని ఆహ్వానించాడని ఆమె చెప్పింది. నేను అక్కడికి ఎలా చేరుకుంటానని అడిగినప్పుడు, అతను నన్ను అటారీ-వాఘా సరిహద్దుకు రమ్మని చెప్పాడని ఆమె తెలిపింది. ఆమెను అట్టారీ-వాఘా సరిహద్దులో దింపమని ఆటో-రిక్షా డ్రైవర్‌తో చెప్పింది. జలియన్‌వాలా బాగ్‌లో నియమించబడిన మరో పోలీసు రంజిత్ సింగ్ ఆమె మాటలను విని ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు. ఆమెను విచారించి, తిరిగి ఇంటికి పంపించే ఏర్పాట్లను పోలీసులు చేశారు.