కేన్స్‎లో అర్ధనగ్నంగా ఉక్రెయిన్ సెలబ్రెటి నిరసన

0
910

ప్రపంచ చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతోంది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న ఈ ఫిల్మ్‌ ఫెస్టివల్‌కు వేలాది మంది నటినటులు హాజరై తళుక్కుమంటున్నారు. ఈ క్రమంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.

ఫిల్మ్ ఫెస్టివల్‌ వేదికగా రెడ్ కార్పెట్‌పై ఉక్రెయిన్‌కు చెందిన ఓ నటి వినూత్నంగా నిరసన తెలిపింది. తమ దేశం ఉక్రెయిన్‌లో మహిళలు, యువతులపై రష్యా సైనికుల అఘాయిత్యాలను ఆపండి అంటూ ఆమె అర్ధనగ్నంగా నినాదాలు చేసింది. దీంతో ఒక్కసారిగా అలర్ట్ అయిన సిబ్బంది ఆమెను చుట్టుముట్టి బయటకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన శుక్రవారం చోటుచేసుకున్నట్లు కెన్స్ ప్రతినిధులు తెలిపారు.

కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌పై నటీమణులు వాక్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఉక్రెయిన్‌ చెందిన సెలబ్రిటి ఒక్కసారిగా రెడ్‌ కార్పెట్‌పైకి వెళుతూ.. ఒక్కసారిగా తన దుస్తులను విప్పి నినాదాలు చేసింది. ఆమె శరీరంపై ఉక్రెయిన్‌ జెండా రంగులను వేసుకొని.. తమపై జరిగే అత్యాచారాలను ఆపండి అంటూ నినాదాలు చేసింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాకయ్యారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఆమెపై దుస్తులు కప్పి అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు.

కాగా.. కేన్స్ వేడుకల్లో భాగంగా ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ భావోద్వేగ ప్రసంగం చేశారు. కేన్స్‌ ప్రారంభోత్సవంలో జెలెన్‌ స్కీ ఉక్రెయిన్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌పై రష్యా బలగాల దాడుల్లో తమ దేశ పౌరులు వేల సంఖ్యలో చనిపోతుంటే.. సినీ ప్రపంచం మౌనంగా ఉంటుందా అంటూ ప్రశ్నించారు. దీంతోపాటు రష్యా సేనలు తమ పౌరులపై దారుణాలకు దిగుతున్నాయని.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సినీ ప్రపంచం దీనిపై స్పందించాలని జెలెన్‌స్కీ కోరారు. దాదాపు రెండు నెలలకు పైగా రష్యా.. ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ క్రమంలో రష్యా.. ఉక్రెయిన్‌పై తీవ్రంగా దాడులు చేస్తుంది. ఈ యుద్ధంలో వేలాది మంది చనిపోగా.. వందలాది భవనాలు ధ్వంసమయ్యాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

three − 1 =