National

బ్రెయిన్ సర్జరీ జరుగుతుండగా.. హనుమాన్ చాలీసా ఆలపించిన మహిళ

ఢిల్లీ ఎయిమ్స్‌లో బ్రెయిన్ ట్యూమ‌ర్ స‌ర్జ‌రీ కొన‌సాగుతుండ‌గా 24 ఏండ్ల మహిళ హ‌నుమాన్ చాలీసా చ‌దివారు. ఆసుపత్రిలోని న్యూరోస‌ర్జ‌రీ విభాగంలో వైద్యులు మూడున్న‌ర గంట‌ల పాటు స‌ర్జ‌రీ నిర్వహించి బ్రెయిన్ ట్యూమ‌ర్‌ను తొల‌గించారు. ఈ సర్జరీ జరిగే సమయంలో ఆమె స్ప్ర‌హ‌లోనే ఉన్నారు. హ‌నుమాన్ చాలీసాను ఆల‌పించారు.

న్యూరో సర్జరీ విభాగం నిర్వహించిన శస్త్రచికిత్సలో కీలకమైన సమయంలో సదరు మహిళ మూడు గంటల పాటు ఆపరేషన్‌లో మెలకువగా ఉంది. మొత్తం హనుమాన్ చాలీసాను పఠించింది. రోగికి పెయిన్ కిల్లర్ మందులను, అనస్థీషియా ఇంజెక్షన్లు ఇచ్చినట్లు ఆపరేటింగ్ బృందంలో భాగమైన డాక్టర్ దీపక్ గుప్తా మీడియా చెప్పారు. రోగి ప్రస్తుతం ఆసుపత్రిలో వైద్య పర్యవేక్షణలో ఉన్నారని త్వరలోనే డిశ్చార్జ్ అవుతారని తెలిపారు. జులై 23న జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను డాక్ట‌ర్ దీప‌క్ గుప్తా వివ‌రించారు. మ‌హిళ‌కు అన‌స్తీషియాతో పాటు పెయిన్‌కిల్ల‌ర్ మందులు ఇచ్చామ‌ని చెప్పారు. ఆప‌రేష‌న్ రూమ్‌లో మ‌హిళ వీడియోను ఓ జ‌ర్న‌లిస్ట్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. ఆమె హ‌నుమాన్ చాలీసా ఏక‌బిగిన చ‌దువుతుండ‌గా దీప‌క్ గుప్తాతో పాటు న్యూరో అన‌స్తీషియా బృందం బ్రెయిన్ ట్యూమ‌ర్ స‌ర్జ‌రీ జ‌రిగింద‌ని చెప్పారు.

గత రెండు దశాబ్దాలుగా ఎయిమ్స్ అనేక “అవేక్ క్రానియోటోమీలు” శస్త్రచికిత్సలను నిర్వహించింది. రోగుల మెదడులోని భాగాలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ఎయిమ్స్ అధికారులు మాట్లాడుతూ ఇటువంటి 500 కి పైగా ఆపరేషన్లు 20 సంవత్సరాలలో పూర్తి చేశామని అన్నారు. ఈ రోజుల్లో ఇలాంటి కేసులలో త్వరగా కోలుకోవడం సాధ్యమవుతుందని అన్నారు. కొన్ని ప్రాంతాల దగ్గర ఉన్న కణితులను తొలగించాలంటే రోగులు మేల్కొని ఉండాల్సి వస్తుందని.. అప్పుడే ఈ మెదడుపై శస్త్రచికిత్సల ద్వారా ప్రయోజనం పొందుతారని నిపుణులు తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published.

fifteen − nine =

Back to top button