More

    20 ఏళ్ల యువతిపై క్షుద్రపూజల పేరుతో అత్యాచారం

    మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. 20 ఏళ్ల యువతికి ఏవేవో దోషాలు ఉన్నాయని.. వాటిని తొలగించడానికి క్షుద్రపూజలు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా పూజలో కూర్చుంటే తాము తమ మంత్ర విద్యలతో నయం చేస్తామని చెప్పారు. అయితే మంత్రం విద్యల సాకుతో ఆమెపై అత్యాచారానికి తెగబడ్డారు. అత్యాచారం చేసి బెదిరింపులకు పాల్పడ్డ ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

    ఫిబ్రవరి 26న పాల్ఘర్ జిల్లాలోని వసాయి తాలూకాలోని నలసోపరా (తూర్పు)లోని చాల్‌ ప్రాంతానికి చెందిన యువతి పోలీసులను సంప్రదించింది. క్షుద్రపూజల పేరుతో తనపై అత్యాచారం జరిగిందని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నీపై ఎవరో చేతబడి చేశారని.. అందుకే నీలో భయం ఎక్కువగా ఉందని ఇద్దరు వ్యక్తులు చెప్పారని ఆమె చెప్పింది. తన జీవితంలో వ్యక్తిగత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న యువతి వారు చెప్పింది నిజమని నమ్మింది. వారి సూచనలను పాటించడానికి అంగీకరించింది.

    క్షుద్రపూజ చేస్తున్నట్లుగా నటిస్తూ ఆమెకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ విషయం గురించి మౌనంగా ఉండాలంటూ ఆమెను బెదిరించారు. అయితే ఆ మహిళ పాల్ఘర్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. అత్యాచారం, నేరపూరిత బెదిరింపుల కోసం ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్లు 376 (D), 506 కింద ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేసింది. పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకోగా.. అప్పటికే ఆ వ్యక్తులు పారిపోయారు. ఫిబ్రవరి 27న వారిని అరెస్టు చేశారు. అత్యాచారం చేసిన వారిని మౌలానా రజబ్ షేక్ (27), షాబుద్దీన్ షేక్ (50)గా గుర్తించారు. “నిందితులు అదే పద్ధతిని అనుసరించి ఇతర మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నాము. వారి బారిన పడిన మహిళలు ఎక్కువ మంది ఉన్నారో తెలుసుకోవడానికి మా దర్యాప్తు కొనసాగుతోంది, ”అని ఒక పోలీసు అధికారి తెలిపారు.

    Trending Stories

    Related Stories