National

మహిళా కానిస్టేబుల్ పై గ్యాంగ్ రేప్

మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఘోరం చోటు చేసుకుంది. మహిళా కానిస్టేబుల్ పై అత్యాచారం చోటు చేసుకుంది. నీముచ్ జిల్లాలో మహిళా పోలీసు కానిస్టేబుల్ పై ఐదుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తనపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, ఆ వీడియోను చిత్రీకరించి బెదిరించారని 30 ఏళ్ల బాధిత మహిళా పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల మొదట్లో ఈ సంఘటన జరగగా కానిస్టేబుల్ సెప్టెంబర్ 13 న ఫిర్యాదు చేశారు. ప్రధాన నిందితుడి తల్లితో సహా ఐదుగురిపై ఈ వారం కేసు నమోదు చేశారు.

బాధిత మహిళా కానిస్టేబుల్‌కు నిందితుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. ఏప్రిల్ నుంచి వాట్సాప్ ద్వారా తరచూ చాటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడి పుట్టిన రోజు వేడుకకు రావాలంటూ బాధితురాలని ఆహ్వానించాడు. అతడి మాటలు నమ్మి వెళ్లిన బాధితురాలిపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పార్టీలో తనపై ప్రధాన నిందితుడు, అతడి సోదరుడు, మరో వ్యక్తి కలిసి అత్యాచారానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. నేరానికి సంబంధించి ప్రధాన నిందితుడిని మరియు అతని తల్లిని పోలీసులు అరెస్టు చేసినట్లు మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి అనురాధ గీర్‌వాల్ తెలిపారు. నిందితులు వీడియో కూడా చిత్రీకరించారని ఆరోపించింది బాధితురాలు. ప్రధాన నిందితుడి తల్లి తనను బెదిరించిందని, నిందితుడి బంధువు కూడా తనను చంపేస్తానని బెదిరించాడని, తన నుంచి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడని బాధితురాలు తెలిపింది.

Related Articles

Back to top button