More

    మహిళలకు మంత్రులయ్యే అర్హతే లేదు: తాలిబాన్

    మహిళల పట్ల తాలిబాన్ల ధోరణి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచానికి స్పష్టంగా తెలుస్తోంది. తాలిబాన్లు మహిళలను ఇంటికే పరిమితం చేయాలని చూస్తున్నారు. అదే విషయాన్ని బహిరంగంగా కూడా చెప్పేస్తూ ఉన్నారు తాలిబాన్ ప్రతినిధులు. తాలిబాన్ ప్రతినిధి సయ్యద్ జెక్రుల్లా హషిమి మాట్లాడుతూ “ఒక మహిళ క్యాబినెట్‌లో ఉండటం తప్పనిసరి కాదు.. మేము వారిని సమాజంలో మహిళలను సగభాగంగా పరిగణించము. ఎలాంటి సగం? సగం కూడా ఇక్కడ తప్పుగా నిర్వచించబడింది.” అని చెప్పుకొచ్చారు. మహిళలు పురుషులతో సమానమని తాలిబాన్ లు విశ్వసించరని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది.

    గత 20 సంవత్సరాలుగా కాబూల్‌లోని యుఎస్-మద్దతుగల ఆఫ్ఘన్ ప్రభుత్వంలో కార్యాలయాలల్లోనే మహిళలతో ‘వ్యభిచారం’ జరిగిందని సయ్యద్ జెక్రుల్లా హషిమి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హషిమి మాట్లాడుతూ మహిళా నిరసనకారులు ఆఫ్ఘనిస్తాన్ మహిళలందరికీ ప్రాతినిధ్యం వహించరని చెప్పారు. తాలిబాన్ ప్రతినిధి మాట్లాడుతూ మహిళలు పిల్లలను ఉత్పత్తి చేయడానికి మాత్రమే పరిమితమైందని అన్నారు. తాత్కాలిక ప్రభుత్వంలో మహిళా ప్రాతినిధ్యం గురించి మీడియా ప్రతినిధులు గుచ్చి గుచ్చి అడగ్గా “ఆఫ్ఘన్ మంత్రిత్వ శాఖ పనిని మహిళలు చేయలేరు. మహిళలు మోయలేనిదాన్ని ఆమె మెడపై వేసినట్లుగా ఉంటుంది” అని మనసులో మాట తెలిపారు.

    మునుపటి తాలిబాన్ పాలనలో (1996-2001) మహిళలు విద్యను అభ్యసించకుండా, ఉద్యోగాలకు వెళ్లకుండా నిరోధించారు. మహిళలు తల నుండి కాలి వరకు తమను తాము కప్పుకోవాల్సి ఉంటుంది.. అన్ని సమయాలలో మగ సంరక్షకుడిని వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇక ఆగస్టులో తాలిబాన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ మహిళలను తమ సొంత భద్రత కోసం పనికి వెళ్లవద్దని హెచ్చరించారు. కొంతమంది తాలిబ్‌లు మహిళలపై దాడి చేసే అవకాశం ఉందని అన్నారు. “కొత్త మరియు ఇంకా బాగా శిక్షణ పొందని మా దళాలు మహిళలను హింసించవచ్చని మేము ఆందోళన చెందుతున్నాము” అని ఆయన అప్పట్లో హెచ్చరించారు.

    Trending Stories

    Related Stories