మహిళ ఒక్కతే వెళుతోందని వేధించాడు.. ఉగ్ర రూపం చూపగానే

0
1058

రాత్రి స‌మ‌యంలో అమ్మాయిలు కనపడితే చాలు.. కొందరు యువకులు చేసే ఓవరాక్షన్ అంతా ఇంతా కాదు. అలాంటి వారిని ఎలా బుద్ధి చెప్పాలో అదే తరహాలో ఓ యువ‌తి బుద్ధి చెప్పింది. బైకుపై వెళ్తుండ‌గా ఓ యువ‌కుడు ఆమెను ఫాలో అవుతూ ఇబ్బంది పెట్టడంతో న‌డిరోడ్డుపైనే ఆ యువ‌కుడికి క‌ర్ర‌తో చితకబాదింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా ఓ యువకుడు బైకును అడ్డగించి వేధింపులకు గురిచేశాడని ఆమె ఆరోపించింది. ఆ ఈవ్ టీజర్ ను ఆ యువ‌తి కర్రతో చితకబాదింది వేధింపుల‌కు గురిచేసిన ఆ యువ‌కుడిని కింద ప‌డేసి ఆ యువ‌తి క‌ర్ర‌తో కొడుతూ.. ఇలా వేధింపులకు గురి చేస్తోంటే ఆడ‌వాళ్లు బ‌య‌ట ఎలా తిర‌గ‌గ‌లుతార‌ని ప్ర‌శ్నిస్తూ యువ‌తి అంద‌రి ముందూ ఆ యువ‌కుడిని చిత‌క‌బాదింది. ఏమి తెలీదురా నీకు.. ఏమి తెలీదురా నీకు..? అంటూ ఆమె ప్రశ్నిస్తూ కొట్టసాగింది.

ఈ వీడియోను ఏపీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, ఆ యువ‌తిని ప్ర‌శంసించారు. “గన్నవరం విమానాశ్రయంలో పనిచేస్తున్న ఒక యువతి ఇంటికి రాత్రిపూట వెళుతుండగా బైక్ ను అడ్డగించి వేధించిన దుండగుడిని కర్రతో చితక్కొట్టిన ఆమె ధైర్యానికి హ్యాట్సాఫ్..” అని వాసిరెడ్డి పద్మ ట్విట్టర్‌లో చెప్పుకొచ్చారు.